South Africa ICC: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ప్రొటీస్‌కు కలిసిరాని ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లు ఇవే!

Here are the all details of South Africa's Bad Luck in ICC tournaments. ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జట్టును దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంటారు. ఐసీసీ టోర్నమెంట్‌లో అదృష్టం కలిసిరాని 4 మ్యాచ్‌లను ఓసారి చూద్దాం.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 28, 2022, 12:55 PM IST
  • దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా
  • ప్రొటీస్‌కు కలిసిరాని ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లు ఇవే
  • అదృష్టం కలిసిరాక ఇంటిదారి
South Africa ICC: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ప్రొటీస్‌కు కలిసిరాని ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లు ఇవే!

Do you know how many times luck not favors to South Africa cricket team in world cups: ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో దక్షిణాఫ్రికా ఒకటి. ఎప్పుడూ జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉంటారు.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంటుంది. కానీ ఐసీసీ టోర్నీలలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఇంతవరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బలమైన జట్టుతో ఐసీసీ టోర్నీల్లో బరిలోకి దిగినప్పటికీ.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో అదృష్టం కలిసిరాక ఇంటిదారి పడుతుంటుంది. వన్డే ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జట్టును దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంటారు. ఐసీసీ టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసిరాని 4 మ్యాచ్‌లను ఓసారి చూద్దాం. 

దక్షిణాఫ్రికా vs జింబాబ్వే:
టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా జింబాబ్వేతో జరిగిన కీలకమైన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ రద్దయ్యే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 24 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది, చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. విజయానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ.. అదృష్టం కలిసిరాక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. దాంతో 2 పాయింట్స్ రావాల్సి ఉండగా.. 1 పాయింట్ మాత్రమే వచ్చింది. 

దక్షిణాఫ్రికా v న్యూజిలాండ్:
2015 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా టైటిల్ హాట్ ఫేవరేట్. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్, వాతావరణం మరియు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రొటీస్ జట్టును ముంచేశాయి. వర్షం కారణంగా మ్యాచ్ 43 ఓవర్లకు కుదించగా.. దక్షిణాఫ్రికా 281/5 స్కోర్ చేసింది. ఆపై వర్షం మరోసారి రావడంతో న్యూజిలాండ్‌ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఒక బంతి ఉండగా గెలిచింది. 

దక్షిణాఫ్రికా v ఇంగ్లండ్:
1992లో ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడింది. ప్రొటీస్ జట్టు మ్యాచ్ గెలవాలంటే 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 1 బంతికి 22 పరుగులుగా విజయ సమీకరణం మారింది. చివరికి ఇంగ్లండ్ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా ఓడిపోయింది. 

దక్షిణాఫ్రికా v శ్రీలంక:
దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో శ్రీలంకతో ప్రోటీస్ డూ ఆర్ డై మ్యాచ్‌ ఆడింది. దక్షిణాఫ్రికా విజయానికి 269 పరుగులు చేయాల్సిన మ్యాచ్‌ ఇది. 45 ఓవర్ల తర్వాత ప్రొటీస్ లక్ష్యానికి చేరువగా ఉన్న సమయంలో.. వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ ఆగే సమయానికి చివరి బంతి ఆడిన మార్క్ బౌచర్ పరుగు చేయలేదు. బౌచర్ ఒక్క పరుగు కూడా తీసి ఉంటే దక్షిణాఫ్రికా విజయం సాధించి ఉండేది.

Also Read: Gujarat Fire Haircut: నిప్పుతో హెయిర్ కటింగ్.. అయ్యో జుట్టు మొత్తం పోయింది.. యువకుడికి తీవ్ర గాయాలు  

Also Read: T20 World Cup: ఆశలన్నీ భారత్‌పైనే.. పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News