T20 World Cup: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. టీ20 ప్రపంచకప్‌ కూడా ఉచితమే

Disney+ Hot Star T20 World Cup: క్రికెట్‌ అభిమానులకు హాట్‌ స్టార్‌ అదిరిపోయే శుభవార్త వినిపించింది. ప్రపంచ అత్యుత్తమ జట్లు తలపడే ఈ టోర్నీని కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చని ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 8, 2024, 06:46 PM IST
T20 World Cup: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. టీ20 ప్రపంచకప్‌ కూడా ఉచితమే

T20 World Cup Hotstar: మరో క్రికెట్‌ పండుగ రాబోతున్నది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముగియగానే టీ 20 ప్రపంచకప్‌ షురూ కానుంది. ప్రపంచ అత్యుత్తమ జట్లు తలపడే ఈ టోర్నమెంట్‌ కోసం క్రికెట్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి క్రికెట్‌ అభిమానులకు హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌ ప్రకటించింది. ఈ ప్రపంచ కప్‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. అయితే ఉచితంగా వీక్షించడానికి కొన్ని షరతులు విధించింది. అవేమిటో తెలుసుకుందాం.

Also Read: India T20 World Cup Squad 2024: రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు.. రాహుల్‌కు షాక్‌

 

ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆసక్తిగా జరుగుతోంది. ఇది ముగిసిన వెంటనే టీ 20 ప్రపంచకప్‌ మొదలు కానుంది. జూన్‌ 2వ తేదీన ఈ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ చూసేందుకు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ శుభవార్త ప్రకటించింది. టీ 20 ప్రపంచకప్‌ ఉచితంగా వీక్షించవచ్చు. ప్రపంచకప్‌ మ్యాచ్‌లన్నీ ఉచితంగా చూడవచ్చు. అయితే అది కేవలం మొబైల్‌ ఫోన్లకు మాత్రమే పరిమితం అనే నిబంధన విధించింది. అయితే హాట్‌ స్టార్‌ కేవలం భారత అభిమానులకు మాత్రమే ఈ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

Also Read: IPL Live Score 2024 LSG vs DC: ఢిల్లీకి భారీ ఊరట.. లక్నోను చిత్తు చేసి 'పంత్‌ సేన' కీలక విజయం

 

మొబైల్‌ వర్షన్‌లో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ లేకుండా ప్రపంచకప్‌ మ్యాచ్‌లను వీక్షించవచ్చని డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ బుధవారం వెల్లడించింది. ఎక్కువ మందికి క్రికెట్‌ వినోదం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. క్రికెట్‌ వినోదాన్ని ఎవరూ కోల్పోకూడదనే ఉద్దేశంతో ఉచిత అవకాశం కల్పించినట్లు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఇండియా హెడ్‌ సజిత్‌ శివానందన్‌ వివరించాడు. 'గతంలో ఆసియా కప్‌, ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌ను కూడా ఉచితంగా చూసే అవకాశం కల్పించాం. ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించడంతో టీ20 ప్రపంచకప్‌కు కూడా అలాంటి అవకాశం కల్పిస్తున్నాం' అని తెలిపారు.

టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2వ తేదీన అమెరికా, కెనడాలో ప్రారంభం కానుంది. 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా టీవీల విషయానికి స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉండడంతో ఐపీఎల్‌ మ్యాచ్‌లను జియో సినిమా కూడా ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News