Dinesh Karthik Retirement: దినేష్‌ కార్తీక్‌ భావోద్వేగ వీడియో.. త్వరలోనే సంచలన నిర్ణయం!

India Batter Dinesh Karthik Shares Mysterious Instagram Post. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు దినేష్‌ కార్తీక్‌ సంకేతాలు ఇచ్చాడని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 24, 2022, 01:46 PM IST
  • దినేష్‌ కార్తీక్‌ భావోద్వేగ వీడియో
  • త్వరలోనే సంచలన నిర్ణయం
  • ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన
Dinesh Karthik Retirement: దినేష్‌ కార్తీక్‌ భావోద్వేగ వీడియో.. త్వరలోనే సంచలన నిర్ణయం!

Dinesh Karthik will announce his retirement soon: మొన్నటివరకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టులో ఉండడంతో మరో వికెట్ కీపర్‌కు అవకాశం లేకుండా పోయింది. పార్థివ్ పటేల్ సహా దినేష్ కార్తీక్ కూడా ఎక్కువగా అవకాశాలు అందుకోలేదు. ధోనీ రిటైర్మెంట్ అనంతరం డీకే, రిషబ్ పంత్‌లకు అవకాశాలు వచ్చాయి. అడపాదడపా అవకాశాలు అందుకున్న డీకే.. ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన చేసి ఫినిషర్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మంచి విజయాలు అందించాడు. దాంతో భారత జట్టులో పునరాగమనం చేశాడు.

ఫినిషర్‌గా టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్న దినేష్ కార్తీక్‌.. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు. కీలక మ్యాచ్‌లలో రిషబ్ పంత్‌ను కాదని ఇచ్చిన అవకాశాలను అందుకోలేకపోయాడు. డీకే సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి విఫలమవడంతో విమర్శల వర్షం కురిసింది. దాంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయలేదు.  

వన్డే ప్రపంచకప్‌ 2023 సన్నాహాకాల్లో భాగంగా భారత్‌ వచ్చే రోజుల్లో ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాబట్టి దినేష్ కార్తీక్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు డీకే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. తాజాగా కార్తీక్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచకప్‌ 2022లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన తోటి ఆటగాళ్లు, కోచ్‌లకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. దాంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు సంకేతాలు ఇచ్చాడని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dinesh Karthik (@dk00019)

'భారత్ తరపున టీ20 ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యం కోసం చాలా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2022 టోర్నీలో  మేము విజయం సాధించకపోవచ్చు. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు' అని వీడియోలో దినేష్ కార్తీక్‌ పేర్కొన్నాడు. 

Also Read: Kamal Haasan Health Update: కమల్ హాసన్‌కు అస్వస్థత.. ఆందోళన అవసరం లేదన్న వైద్యులు

Also Read: Guru Margi 2022: ఈరోజు నుంచి లాభాలు పొందబోయే రాశువారు వీరే.. మీది కూడా ఈ రాశేనా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x