No Ball Issue: మరోసారి నో బాల్ హైడ్రామా సృష్టించిన రిషభ్ పంత్, జరిమానా తప్పదా..?

No Ball Issue: ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ వ్యవహారశైలి గత కొద్దికాలంగా చర్చనీయాంశమవుతోంది. మరోసారి నో బాల్ విషయంలో అంపైర్‌పై అసహనం వ్యక్తంతే చేయడమే కాకుండా రాద్ధాంతం సృష్టించాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 29, 2022, 03:12 PM IST
  • ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి అంపైర్‌తో వాగ్వాదం
  • కేకేఆర్‌త ోజరిగిన మ్యాచ్‌లో నో బాల్ విషయంపై రాద్ధాంతం
  • రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా నో బాల ్ విషయమై గొడవ చేసిన పంత్
No Ball Issue: మరోసారి నో బాల్ హైడ్రామా సృష్టించిన రిషభ్ పంత్, జరిమానా తప్పదా..?

No Ball Issue in Delhi Vs Rajasthan Match: ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ వ్యవహారశైలి గత కొద్దికాలంగా చర్చనీయాంశమవుతోంది. మరోసారి నో బాల్ విషయంలో అంపైర్‌పై అసహనం వ్యక్తంతే చేయడమే కాకుండా రాద్ధాంతం సృష్టించాడు.

ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు మ్యాచ్ అంపైర్‌కు మధ్య మరోసారి వివాదం నెలకొంది. అది కూడా నో బాల్ విషయంలోనే. మొన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా..తన ఆటగాళ్లను గ్రౌండ్ నుంచి వెనక్కి వచ్చేయాల్సిందిగా పిలుపునిచ్చాడు. అతడి ఈ వైఖరి చర్చనీయాంశమవడమే కాకుండా భారీగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఫలితంగా రిషభ్ పంత్‌పై జరిమానా విధించింది బీసీసీఐ. ఇప్పుడు మరోసారి అంపైర్‌తో వివాదం కారణంగా వార్తల్లోకెక్కాడు. గురువారం నాడు ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో అటువంటి దృశ్యమే మరోసారి రిపీట్ అయింది. నో బాల్ విషయంలో అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

ఐపీఎల్ 2022 41 మ్యాచ్ ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ నోబాల్ విషయంలో అంపైర్‌తో గొడవకు దిగాడు. ఢిల్లీ కేపిటల్స్ బౌలర్ లలిత్ 17వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్ మూడవ బంతి హై ఫుల్ టాస్ కావడంతో అంపైర్ నో బాల్ ప్రకటించాడు. దాంతో అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. రీప్లేలో కూడా లలిత్ యాదవ్ వేసిన బంతి నితీష్ రాణా నడుపుపై భాగం నుంచి వెళ్తూ కన్పించింది. అంటే నో బాల్ నిర్ణయం సరైందే. కానీ రిషభ్ పంత్ ఈ నో బాల్ విషయంలో అంపైర్‌తో వాగ్వాదం మొదలెట్టాడు. అంపైర్ పూర్తిగా నచ్చజెప్పిన తరువాతే రిషభ్ పంత్ అంగీకరించాడు. ఆ తరువాత బాల్ ఫ్రీ భాల్ లభించినా కేకేఆర్ జట్టు లబ్ది పొందలేకపోయింది.

నో బాల్ విషయంలో అంపైర్‌తో వివాదానికి దిగడం రిషభ్ పంత్‌కు ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంత్ చేసిన హైడ్రామా పెద్దఎత్తున వివాదమైంది. మ్యాచ్ చివరి ఓవర్‌లో ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ గెలిచేందుకు 36 పరుగులు కావల్సి ఉండగా..పోవెల్ వరుసగా మూడు సిక్సర్లు సంధించాడు. అయితే మూడవ బంతి ఫుల్ టాస్. అది నో బాల్ అంటూ పంత్ సహా ఢిల్లీ ఆటగాళ్లు వాదన ప్రారంభించారు. కానీ అంపైర్ ఆ బంతి సరైందేనని చెప్పడంతో ఆగ్రహించిన పంత్..గ్రౌండ్‌లో తన ఆటగాళ్లను వెనక్కి వచ్చేయాల్సిందిగా సైగలు చేస్తూ కన్పించాడు. ఫలితంగా పంత్‌పై ఆ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించారు. 

Also read: DC vs KKR: చెలరేగిన వార్నర్, పొవెల్.. కోల్‌కతాపై ఢిల్లీ విజయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News