Daren Sammy: ఇషాంత్ పై కోపం లేదు

సుమారు నాలుగు నెలల క్రితం కరేబియన్ క్రికెటర్ డారెన్ సామీ ( Daren Sammy ) హఠాత్తుగా ఐపిఎల్ లో వర్ణ వివక్ష ( Racism ) గురించి ఫిర్యాదు చేశాడు.

Last Updated : Aug 20, 2020, 05:21 PM IST
    • సుమారు నాలుగు నెలల క్రితం కరేబియన్ క్రికెటర్ డారెన్ సామీ హఠాత్తుగా ఐపిఎల్ లో వర్ణ వివక్ష గురించి ఫిర్యాదు చేశాడు.
    • ఈ ఆరోపణలపై క్రీడా ప్రపంచం షాక్ అయింది.
    • చాలా మంది ఎక్కడో ఒక చోట తము కూడా రేసిజంకు గురి అయ్యాం అని తెలిపారు.
Daren Sammy: ఇషాంత్ పై కోపం లేదు

సుమారు నాలుగు నెలల క్రితం కరేబియన్ క్రికెటర్ డారెన్ సామీ ( Daren Sammy ) హఠాత్తుగా ఐపిఎల్ లో వర్ణ వివక్ష ( Racism ) గురించి ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణలపై క్రీడా ప్రపంచం ( World ) షాక్ అయింది. చాలా మంది ఎక్కడో ఒక చోట తము కూడా రేసిజంకు గురి అయ్యాం అని తెలిపారు. సామీ నిందతో నల్ల జాతి క్రీడాకారుల గౌరవం గురించి ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. జార్జ్ ప్లాయిడ్ హత్య తరువాత ప్రపంచం మొత్తం వర్ణ వివక్షతపై ఉద్యమించింది. సమీ పోస్టు ఆ ఉద్యమానికి ఆజ్యం పోసినట్టు పని చేసింది.

హైదరాబాద్ ఫ్రాంచైజీ తరపున ఐపిఎల్ ( IPL ) లో ఆడినప్పుడు.. తన టీమ్ సభ్యుల్లో కొంత మంది తనను కాలు  అని పిలిచేవారట. అప్పుడు తనకు ఆ పేరు అర్థం ఏంటో తెలియలేదట. తనను ప్రేమతో పిలుస్తున్నారు అని అనుకున్నాడట. కానీ తన శరీర రంగును బట్టి అలా పిలిచేవారు అని తరువాత తెలిసిందట. ముఖ్యంగా ఇషాంత్ శర్మ సమీని కాలు ( Kaalu ) అని పిలిచేవాడట. దీనిపై క్రీడాభిమానులు నిరసన వ్యక్తం చేశాడు. దీనిపై తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన డారెన్ సామీ ఈ విషయంలో ఇషాంత్ ( Ishant Sharma ) పై ఎలాంటి కోపం లేదు అని తెలిపాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Darren Sammy via Instagram on racism at the IPL #ipl #darrensammy

A post shared by Crickindex.offical (@cricindex.offical) on

 

Trending News