Bhavina Patel wins gold medal in para TT at CWG 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినా పటేల్ గోల్డ్ మెడల్ సాధించారు. శనివారం జరిగిన పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ క్లాస్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకున్నారు. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన ఇఫెచుక్వుడే క్రిస్టియానా ఇక్‌పెయోయ్‌పై 3-0 (12-10 11-2 11-9)తో గెలుపొందారు. దీంతో టీటీ విభాగంలో భారత తరఫున గోల్డ్ మెడల్ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డుల్లోకి ఎక్కింది.
2011 పీటీటీ థాయ్‌లాండ్ ఓపెన్‌లో వ్యక్తిగత విభాగంలో రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భావినా పటేల్ ప్రపంచ నంబర్ 2 ర్యాంకింగ్‌కు చేరుకున్నారు. 2013లో బీజింగ్‌లో జరిగిన ఆసియా పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ క్లాస్ 4లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఏకంగా స్వర్ణ పతకం సాదించారు. గోల్డ్ మెడల్ గెలిచిన భావినాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సోనాల్‌బెన్ మనుభాయ్ పటేల్ కూడా మహిళల సింగిల్స్ క్లాస్ 3-5 కేటగిరీలో కాంస్యం పతకం సాధించి భారత్‌కు మరో పతకాన్ని అందించారు. 34 ఏళ్ల మనుభాయ్ కాంస్య పతక ప్లే ఆఫ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన స్యూ బెయిలీపై 11-5 11-2 11-3 తేడాతో గెలుపొందారు. అయితే పురుషుల సింగిల్స్ కేటగిరీలో రాజ్ అరవిందన్ అళగర్ నిరాశపరిచాడు. కాంస్య పతక ప్లే-ఆఫ్‌లో 0-3తో నైజీరియాకు చెందిన ఇసౌ ఒగున్‌కున్లే చేతిలో ఓడిపోయాడు. కామన్వెల్త్ 2022లో భారత పతకాల సంఖ్య మొత్తంగా 40కి చేరింది. ఇందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి.
Our country is constantly being brought up with the stellar performance of Indian sports talent in #CommonwealthGames2022.
In this sequence, in the Para Table-Tennis match, Gujarat's pride, Bhavinaben Patel, won the GOLD🏅medal and made the nation proud.
You are a champion 👏 pic.twitter.com/ANWtyMiksA
— Sports Authority of Gujarat (@sagofficialpage) August 6, 2022
Also Read: సూర్యాస్తమయం తర్వాత ఈ సాధారణ పరిహారం చేయండి.. ధనవంతులు కండి!
Also Read: Tulsi Plant Rules: తులసి మొక్క నాటుతున్నారా.. అయితే ఈ 5 నియమాలు తప్పనిసరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook