Smriti Mandhana, Mithali Raj fifties helps India set 275 target to South Africa: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (53; 46 బంతుల్లో 8x4), స్మృతి మందాన (71; 84 బంతుల్లో 6x4, 1x6) హాఫ్ సెంచరీలు చేయగా.. మిథాలీ రాజ్ (68; 84 బంతుల్లో 8x4) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఇక ఇన్నింగ్స్ చివరలో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించింది. ప్రొటీస్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మసాబాటా క్లాస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మందాన మంచి భాగస్వామ్యం అందించారు. ఇద్దరు క్రీజులో కుదురుకున్నాక మంచి షాట్లు ఆడారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. వీలు చిక్కిన్నప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు స్మృతి, షెఫాలీలు 91 పరుగులు జోడించారు. అయితే అర్ధ శతకం తర్వాత షెఫాలీ రనౌట్ కాగా.. మరి కాసేపటికే యాస్తిక భాటియా (2) కూడా ఔట్ అయింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్, స్మృతి మందాన నిలకడగా ఆడారు. ఈ జంట మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు 80 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దూకుడు మీదున్న స్మతి ఔట్ కావడంతో భారత్ స్కోర్ వేగం కాస్త తగ్గింది. మిథాలీ తనదైన శైలిలో ఆడుతూ అర్ధ శతకం పూర్తిచేసింది. అయితే స్వల్ప వ్యవధిలో మిథాలీతో పాటు పూజా వస్త్రాకర్ (3) పెవిలియన్ చేరింది.
𝐈𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐁𝐫𝐞𝐚𝐤: After opting to bat first, India make 274-7 from 50 overs against South Africa. Shafali, Smriti and Mithali scored half-centuries while Harman made 48.
Details▶️ https://t.co/BWw8yYwlOS#TeamIndia | #CWC22 | #INDvSA pic.twitter.com/LrN0PcECSF
— BCCI Women (@BCCIWomen) March 27, 2022
ఇక ఇన్నింగ్స్ చివరలో హర్మన్ ప్రీత్‌కౌర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులో నిలబడి దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. చివరి ఓవర్ మూడో బంతికి 48 పరుగుల వద్ద హర్మన్ పెవిలియన్ చేరింది. రీచా ఘోష్ 8 రన్స్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు చివర్లో చెలరేగడంతో భారత్ 274/7తో సరిపెట్టుకుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్‌కు వెళ్లాలంటే భారత్ ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. ఓడితే మాత్రం అంతే సంగతులు.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ హాఫ్ సెంచరీ.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు!
Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Womens World Cup 2022: చెలరేగిన భారత మహిళలు.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్! గెలిస్తేనే మిథాలీసేన సెమీస్‌కు!
మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్
చెలరేగిన భారత మహిళలు
దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్