గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 2 వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 

Last Updated : May 23, 2018, 06:09 PM IST
 గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేడు జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. మరో 5 బంతులు మిగిలి వుండగానే గెలుపును సొంతం చేసుకుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో రెండవ క్వాలిఫయర్ మ్యాచ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

ఇదిలావుంటే, ఐపీఎల్ 2018 విజయాల పట్టికలో అగ్రభాగాన నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాతి జట్లు అయిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ రేపటి బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో మే 25న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. నేటి తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఫలితం తేలిపోవడంతో ఇక క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి అంతా ఎలిమినేటర్ మ్యాచ్‌పై ఫోకస్ అయింది.  

Trending News