కోల్‌కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయం..!

చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బయట అవాంతరాలు ఎదురైనా ఎదురీది ఆడింది.

Last Updated : Apr 11, 2018, 06:44 AM IST
కోల్‌కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయం..!

చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బయట అవాంతరాలు ఎదురైనా ఎదురీది ఆడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇచ్చిన 203 పరుగుల టార్గెట్‌ను కష్టపడి పూర్తి చేసి విజయాన్ని నమోదు చేసింది.  యువ క్రికెటర్ శామ్‌ బిల్లింగ్స్‌ (56; 23 బంతుల్లో 2×4, 5×6), షేన్‌ వాట్సన్‌ (42; 19 బంతుల్లో 3×4, 3×6), అంబటి రాయుడు (39; 26 బంతుల్లో 3×4, 2×6) చెన్నై విజయంలో చెప్పుకోదగ్గ పాత్రను పోషించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఆండ్రూ రసెల్‌ (88; 36 బంతుల్లో 1×4, 1×6)  చేసిన అర్థ శతకం వల్లే భారీ స్కోరుని నమోదు చేసి.. చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత హోరా హోరిగా సాగిన పోరులో ఆఖరి ఆరు బంతుల్లో చెన్నైకు 17 పరుగులు కావాల్సి ఉండగా.. రవీంద్ర జడేజా (11; 7 బంతుల్లో 1×6), డ్వేన్‌ బ్రావో (11; 5 బంతుల్లో 1×6) చెరో సిక్స్‌ కొట్టి.. ఆ తర్వాత సింగిల్స్‌ తీసి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 

Trending News