IPL 2021: CSK జట్టులోకి కరేబియన్ క్రికెటర్..సామ్‌ కరన్‌ స్థానంలో..

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ స్థానంలో కరేబియన్‌ క్రికెటర్‌ డొమినిక్‌ డ్రేక్స్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రకటించింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 01:24 PM IST
  • చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులోకి కరేబియన్ క్రికెటర్
  • సామ్ కరణ్ స్థానంలో డొమినిక్ డ్రేక్స్ కు అవకాశం
  • ఇటీవల కరేబియన్‌ లీగ్‌లో అదరగొట్టిన డ్రేక్స్
IPL 2021: CSK జట్టులోకి కరేబియన్ క్రికెటర్..సామ్‌ కరన్‌ స్థానంలో..

Sam Curran Replaced With Dominic Drakes: చెన్నై సూపర్‌కింగ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వెన్ను నొప్పితో జట్టుకు దూరమైన సామ్ కరన్ స్థానంలో కరేబియన్ ఆల్ రౌండర్ డొమినిక్‌ డ్రేక్స్‌(Dominic Drakes)ను జట్టులోకి తీసుకుంటున్నట్లు సీఎస్కే(Chennai Super Kings) ప్రకటించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వెన్నునొప్పితో బాధపడిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌(Sam Curran) జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానాన్ని డొమినిక్‌తో భర్తీ చేయనున్నారు.  

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ వెస్బెర్ట్‌ తనయుడైన డొమినిక్‌.. ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు. అయితే, ఇటీవల ముగిసిన కరేబియన్‌ లీగ్‌(Caribbean legue)లో మాత్రం అదరగొట్టాడు. సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు... టోర్నీలో మొత్తంగా 16 వికెట్లు తీశాడు. ముఖ్యంగా.. ఫైనల్‌లో... 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు తొలి టైటిల్‌ అందించడంలో డొమినిక్‌ కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’గా నిలిచాడు. 

Also Read: IPL 2021: ప్రాక్టీస్ వీడియో పోస్ట్ చేసిన కోహ్లీ... కన్నుల పండగ్గా ఉందన్న ఆఫ్రిది

నెట్‌ బౌలర్‌గా యూఏఈకి వచ్చి ఐపీఎల్‌(IPL 2021) బబుల్‌లో ఉన్న 23 ఏళ్ల డొమినిక్‌.. ఇప్పుడు సీఎస్‌కేలో సామ్‌ కరన్‌ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌ గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో డొమినిక్‌ తుది జట్టులో చోటు దక్కించచుకుంటాడా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో తొమ్మిదింట గెలిచిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News