ఐపీఎల్ 13వ సీజన్ ( IPL Season 13 ) మహేంద్ర సింగ్ ధోనీకి అంతగా కలిసి రావడం లేదు. తన ఫామ్ కోల్పోయిన ధోనీ దానిని తిరిగి సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవీ విజయం సాధించడం లేదు. దీంతో చాలా మంది ధోనీ ఆటతీరును విమర్శిస్తున్నారు. మరోవైపు మాజీ టీమ్ ఇండియా కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలి మాత్రం ధోనీ ( MS Dhoni ) చాలా కాలం తరువాత ఆడుతున్నాడు కాబట్టి ఇలా అవుతుందేమో.. క్రీడాకారులు ఫామ్ కోల్పోవడం సహజం అని ధోనీకి మద్దతు ఇచ్చాడు.
ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) ఇప్పటి వరకు చెన్నై టీమ్ మొత్తం 7 మ్యాచులు ఆడినా.. ధోనీ ప్రదర్శన మెరుగు అవ్వలేదు. అయితే ఇటీవలే చెన్నైపై ( CSK ) కేకేఆర్ టీమ్ విజయం సాధించడంతో వెస్టిండీజ్ దిగ్గజం బ్రియాన్ లారా కామెంట్ చేశాడు.
ALSO READ| Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం
ఇక మ్యాచుల పరంగా ధోనీ ట్రాక్ రికార్డు చూస్తే..
* తొలి మ్యాచు - ముంబై ఇండియన్స్: ఏడవ స్థానంలో బ్యాటింగ్ దిగిన ధోనీ.. రెండు బంతులు ఆడినా ఒక్క పరుగు చేయలేదు.
* రెండవ మ్యాచు - రాజస్థాన్ రాయల్స్: మళ్లీ ఏడవ స్థానంలో బ్యాటింగ్... 18 బంతుల్లో 29 పరుగులు చేసినా మ్యాచును గెలిపించడలేపోయాడు.
* మూడవ మ్యాచు - ఢిల్లీ క్యాపిటల్స్ : ఆరవ స్థానంలో బ్యాటింగ్... 12 బంతుల్లో 15 పరుగులు..కానీ మ్యాచు గెలవలేదు.
* నాలుగవ మ్యాచులో ధోనీ 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. కానీ మ్యాచు మాత్రం గెలిపించలేపోయాడు.
* ఐదవ మ్యాచు ఇందుల్ ధోనీ బ్యాటింగ్ చేయలేదు. చెన్నై 10 వికెట్లతో గెలిచింది.
* ఆరవ మ్యాచు -కేకేఆర్-12 బంతుల్లో 11 పరుగులు చేశాడు ధోనీ. చెన్నై టీమ్ ఖాతాలో మరో ఓటమి.
ALSO READ| Photo Story: ఐపిఎల్ లో అదరగొట్టే భారతీయ క్రీడాకారులు వీళ్లే
ఈ మ్యాచు ఫలితాలు చూసిన తరువాత బ్రియాన్ లారా ( Brian Lara ) స్పందిస్తూ..ధోనీ పూర్తిగా మారిపోయాడు. ఎందుకిలా అయ్యాడో అర్థం అవడం లేదు. ప్రస్తుతం ధోనీపై ఆధారపడకుండా ఇంకో ప్లేయర్ కోసం చూడాలి అని అన్నాడు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR