Brendon McCullum: ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్​ జట్టు హెడ్​ కోచ్​గా మెక్​కలమ్

Brendon McCullum: ఇంగ్లాండ్ టెస్ట్​ జట్టుకు హెడ్​ కోచ్​గా కివీస్ మాజీ సారథి బ్రెండన్ మెకల్లమ్ నియామకమయ్యాడు. ఈ విషయాన్ని  ఈసీబీ అధికారికంగా ప్రకటించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 01:24 PM IST
Brendon McCullum: ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్​ జట్టు హెడ్​ కోచ్​గా మెక్​కలమ్

England cricket team New Coach: ఇంగ్లాండ్ పురుషుల టెస్టు జట్టు ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum) నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. జూన్ 2న లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ ద్వారా మెకల్లమ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 

"బ్రెండన్‌ను ఇంగ్లాండ్  పురుషుల టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అతని నియామకం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు మంచిదని నేను నమ్ముతున్నాను" అని ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ అన్నాడు. యాషెస్​ సిరీస్​లో (Ashes series) ఆసీస్ చేతిలో 4-0 ఘోర పరాజయాన్ని చవిచూడం వల్ల కోచ్ పదవి నుంచి క్రిస్ సిల్వర్‌వుడ్ వైదొలిగాడు. ఇందులో భాగంగానే జో రూట్​ను కెప్టెన్​ బాధ్యతల నుంచి తప్పించి...ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు సారథి బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు కొత్త కోచ్ ను తీసుకొచ్చింది.

బ్రెండన్ మెకల్లమ్... ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా సీపీఎల్ ఫ్రాంచైజీ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్నాడు. మెకల్లమ్..ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 పట్టికలో ఇంగ్లాండ్ స్థానాన్ని ఎంతమేరుకు మెరుగుపడేలా చేస్తాడో చూడాలి. ప్రస్తుతం వరుస ఓటములతో ఇంగ్లండ్ ప్రస్తుతం అట్టడుగున కొనసాగుతోంది.

Also Read: IPL Updates: తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై రోహిత్ శర్మ ప్రశంసలు... త్వరలో టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని ధీమా.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News