Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!

Bhuvneshwar Kumar surpassing Yuzvendra Chahal in T20 Cricket for India. టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా టీమిండియా సీనియర్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రికార్డు నెలకొల్పాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 25, 2022, 01:27 PM IST
  • పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్‌ విజయం
  • భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త చరిత్ర
  • తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!

Bhuvneshwar Kumar becomes highest wicket taker in T20 Cricket for India: టీమిండియా సీనియర్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా భువీ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిన్‌ షా ఆఫ్రిదిని ఔట్‌ చేయడంతో భువనేశ్వర్‌ ఖాతాలో 86వ వికెట్ చేరింది. దాంతో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ రికార్డును భువీ బద్దలు కొట్టాడు. 

ఇప్పటివరకు 80 టీ20 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్‌ కుమార్‌ 86 వికెట్లు సాధించాడు. అంతకుముందు ఈ  రికార్డు టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ పేరిట ఉండేది. చహల్‌ పొట్టి ఫార్మాట్‌లో 85 వికెట్స్ పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో చహల్‌ రికార్డును భువీ బ్రేక్‌ చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి ఒక వికెట్‌ని పడగొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి ఓవర్లో అయితే ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. ఒక వైడ్ మాత్రమే వేశాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. విరాట్ కోహ్లీ (82 నాటౌట్‌; 53 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్‌కు వెళ్లడం చాలా సులువైంది. గ్రూప్-2లో ఉన్న భారత్ మరో 3 విజయాలు సాధిస్తే సునాయాసంగా సెమీస్ చేరుకుంటుంది.

Also Read: పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్‌ విజయం.. ఇలా అయితే భారత్ సెమీ ఫైనల్‌కు ఈజీగా చేరుతుంది!

Also Read: ఆ ఒక్క కారణంతోనే హీరోయిన్‌గా నటించొద్దని నిర్ణయించుకున్నా.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News