India vs Srilanka: ఇండియా శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌లో కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్ ఆధిపత్యం స్పష్టంగా కన్పించింది. తొలిరోజంతా బౌలర్లే రాజ్యమేలారు.
ఇండియా శ్రీలంక రెండవ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా ప్రారంభమైంది. ఇటు ఇండియా అటు శ్రీలంక బౌలర్లు నువ్వా నేనా రీతిలో సత్తా చాటారు. బెంగళూరు వేదికగా ప్రారంభమైన రెండవ టెస్ట్ మ్యాచ్ తొలిరోజంతా బౌలర్లదే ఆధిపత్యం కన్పించింది. రెండు దేశాల బౌలర్లు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ వివరాలు పరిశీలిద్దాం.
ఇండియా శ్రీలంక డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా, శ్రీలంక బౌలర్లు చెలరేగి కన్పించారు. ఇరు జట్ల బౌలర్లు కలిసి ఒకేరోజు 16 వికెట్లు పడగొట్టారు. పింక్ బాల్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు. ఇదే తొలిసారి. 2017లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ లో 13 వికెట్లు, 2018 న్యూజిలాండ్ ఇంగ్లండ్ మ్యాచ్‌లో 13, 2019 ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 13 వికెట్లు, 2021 ఇండియా ఇంగ్లండ్ మ్యాచ్‌లో 13 వికెట్లు పడ్డాయి. ఈసారి పాత రికార్డుల్ని తిరగరాస్తూ ఇండియా శ్రీలంక బౌలర్లు 16 వికెట్లు సాధించారు.
బెంగళూరులో ప్రారంభమైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా తొలిరోజు ముగియకుండానే 252 పరుగులకు ఆలవుట్ అయింది. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 92 పరుగులు సాధించడంతో ఇండియాకు ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు దక్కింది. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ మూడేసి వికెట్లు పడగొట్టగా..ధనంజయ డిసిల్వా 2 వికెట్లు, సురంగ లక్మల్ ఒక వికెట్ పడగొట్టారు. మరో వికెట్ రనవుట్ రూపంలో పోయింది. అనంతరం బ్యాటింగ్ దిగిన శ్రీలంక 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా బౌలర్లు మొహమ్మద్ షమీ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఇలా తొలిరోజు ఆటంతా బౌలర్లదే ఆధిపత్యం కొనసాగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
India vs Srilanka: బెంగళూరు టెస్ట్‌లో సరికొత్త రికార్డు, ఏకంగా 16 వికెట్లు