Breaking News: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి కరోనా.. వుడ్‌లాండ్‌ ఆస్పత్రిలో చేరిక!!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. సోమవారం రాత్రి దాదాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 11:03 AM IST
  • టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా
  • వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరిక
  • సౌరవ్ గంగూలీకి తేలికపాటి లక్షణాలు
Breaking News: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి కరోనా.. వుడ్‌లాండ్‌ ఆస్పత్రిలో చేరిక!!

BCCI President Sourav Ganguly tests positive for Covid 19: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)కి కరోనా (Coronavirus) సోకింది. సోమవారం రాత్రి (డిసెంబర్ 27) దాదాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరారు. ప్రస్తుతం దాదా (Dada) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. అయితే గంగూలీ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు కరోనా టెస్టులు (RT-PCR) చేసుకోనున్నారని సమాచారం తెలుస్తోంది. 

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) విధి నిర్వహణలో భాగంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. సోమవారం రాత్రి ఆయన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలలో కరోనా పాజిటివ్‌గా  (Sourav Ganguly Test Positive for Covid) తేలడంతో.. వెంటనే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం దాదా కోల్‌కతాలోని వుడ్‌లాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగూలీ రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కరోనా బారిన పడటం గమనార్హం. గతంలో గంగూలీ కుటుంబ సభ్యులు వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. దాదా సోదరుడి ఇంట్లో కరోనా కలకలం రేపింది. 

Also Read: Ashes 2021: బోలాండ్‌ సంచలన ప్రదర్శన.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం! యాషెస్‌ ఆసీస్‌దే!!

మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో సౌరవ్ గంగూలీ గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స కూడా చేశారు. దాదా గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉండడంతో స్టెంట్లు వేశారు. అనంతరం దాదా పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2021, టీ20 ప్రపంచకప్ 2021 లాంటి వ్యవహారాలను చక్కబెట్టారు. తాజాగా దాదాకు కరోనా సోకింది. దాంతో గంగూలీ ఈ ఏడాది ఆసుపత్రి పాలవ్వడం ఇది మూడోసారి. ప్రతిసారి దాదా కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలోనే చేరారు.

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భారత్ (India) తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 7212 పరుగులు, వన్డేల్లో 11363 రన్స్ చేశారు. మొత్తంగా 38 అంతర్జాతీయ సెంచరీలు దాదా నమోదు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లోనూ 59 మ్యాచ్‌లాడిన గంగూలీ.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశారు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్‌ 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. మీడియం పేస్ బౌలింగ్‌తో దాదా ఆకట్టుకున్నారు. ఇక టీమిండియా సారథిగా, బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన ముద్రవేశారు.

Also Raed: సోనియా గాంధీకి చేదు అనుభవం.. అటు పార్టీ జెండా పడిపాయే.. పాలనలోనూ పడిపాయే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News