IPL 2023 Format: ఐపీఎల్ 2023లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్..పాత ఫార్మట్‌లో ప్రవేశించనుంది. ఆ వివరాల్ని స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు.
ఐపీఎల్ 2023 తిరిగి లీగ్ పాత ఫార్మట్‌కు వచ్చేస్తోంది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు ఐపీఎల్‌లో జట్లు స్వదేశంలో, బయటా ఆడేవారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి బయో బబుల్ వాతావరణంలో, ట్రావెలింగ్ నిబంధనలకు అనుగుణంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఐపీఎల్ నిర్వహణ జరిగింది. ఇందులో భాగంగానే యూఏఈలో ని దుబాయ్, షార్జా, అబుదాబిలకు మ్యాచ్‌లు పరిమితమయ్యాయి.
ఐపీఎల్ 2023 తిరిగి పాత విధానంలో..
ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ తిరిగి పాత విధానానికి వచ్చేస్తోంది. అంటే ఒక జట్టు 7 మ్యాచ్‌లు స్వదేశంలో, 7 మ్యాచ్‌లు బయట ఆడుతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధృవీకరించారు.
2021లో కూడా ఐపీఎల్ కేవలం నాలుగు ప్రాంతాల్లో జరిగింది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నైల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు కోవిడ్ మహమ్మారి నియంత్రణలో ఉన్నందున...క్యాష్ రిచ్ లీగ్ తిరిగి పాత విధానానికి వచ్చేస్తోంది. ఇందులో ప్రతి జట్టు ఒక మ్యాచ్ స్వదేశంలో, ఒక మ్యాచ్ బయట ఆడుతాయి.
ఐపీఎల్ 2023 సీజన్ హోమ్ అండ్ ఎవే ఫార్మట్‌లో మొత్తం పది జట్లతో జరగనుంది. 2020 తరువాత పూర్తి స్థాయిలో డొమెస్టిక్ సీజన్‌ను బీసీసీఐ నిర్వహిస్తోంది. ఇందులో మల్టీ డే టోర్నమెంట్స్ ఉంటాయి.
విమెన్స్ ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచి
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విమెన్స్ ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 మహిళల ప్రపంచ కప్ తరువాత మార్చ్ నెలలో జరిగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో తొలి విమెన్స్ ఐపీఎల్ సీజన్ జరగనుంది.
Also read: IND vs AUS 3rd T20 Tickets: అభిమానులకు 10 వేల టికెట్లేనా.. మిగతా 29 వేల టికెట్స్ ఏమయినట్టు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook