IPL 2022 Closing Ceremony: ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. కరోనా భయం లేకపోవడంతో ఈసారి ఐపీఎల్ ముగింపు వేడుకల్ని అత్యంత ఘనంగా ప్లాన్ చేసింది బీసీసీఐ. ముగింపు వేడుకలు ఎలా ఉంటాయంటే..
ఐపీఎల్ 2022 లీగ్ దశ మరో వారం రోజుల్లో ముగియనుంది. కీలకమైన ప్లే ఆఫ్ దశ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఫస్ట్ ప్లే ఆఫ్ టీమ్ నిర్ధారణ కాగా, రెండవది కూడా దాదాపుగా తెలిసిపోతోంది. ఇక 3, 4 స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ సమీకరణాలు, గెలుపోటముల సంగతి ఇలా ఉంటే..బీసీసీఐ మాత్రం ముగింపు వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించింది.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఐపీఎల్ జరుగుతున్నా..వేడుకలు మాత్రం జరగడం లేదు ఈసారి మాత్రం ఐపీఎల్ 2022 ముగింపు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. మే 29వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ముగింపు వేడుకల సందర్భంగా..టీమ్ ఇండియా కెప్టెన్లుగా వ్యవహరించినవారందరినీ సత్కరించాలనేది బీసీసీఐ ఆలోచనగా ఉంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో టీమ్ ఇండియా క్రికెట్ ఎదుగుదలకు సంబంధించిన డాక్యమెంటరీ సిద్ధమౌతోంది.
ఇక ముంగిపు వేడుకలకు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహామాన్తో ప్రత్యేక షో ఏర్పాటు చేయనుంది బీసీసీఐ. ఓ ఏజెన్సీకు ఇందుకు సంబంధించిన పనులు అప్పగించింది. అటు 83 సినిమాతో క్రికెట్ అభిమానులకు కూడా చేరువైన రణవీర్ సింగ్‌తో మరో కార్యక్రమం సిద్ధం చేస్తోంది.
తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ మే 24వ తేదీన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుండగా, ఎలిమినేటర్ మ్యాచ్ మే 25వ తేదీన జరగనుంది. ఇక మే 27వ తేదీన అహ్మాదాబాద్‌లో రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఇక మే 29న అహ్మాదాబాద్ స్టేడియంలో ఫైనల్ ఉంటుంది.
Also read: Ravindra Jadeja: ఐపీఎల్ నుంచి రవీంద్ర జడేజా ఔట్.. కారణం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.