Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. బీసీసీఐ మరో సంచలన నిర్ణయం.. ఆ సిరీస్ తరువాత ప్రకటన..!

Rohit Sharma T20 Captaincy: టీ20 వరల్డ్ కప్‌ ఓటమి తరువాత కెప్టెన్ రోహిత్ శర్మపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీని వదులుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2022, 03:54 PM IST
  • కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఉద్వాసన
  • టీ20ల్లో కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యాకు అవకాశం
  • సంచలన నిర్ణయం తీసుకుంటుందా..?
Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. బీసీసీఐ మరో సంచలన నిర్ణయం.. ఆ సిరీస్ తరువాత ప్రకటన..!

Rohit Sharma T20 Captaincy: టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా ఫ్లాప్‌ షో తరువాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యాక్షన్ మోడ్‌లో దిగింది. సీనియర్ సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీకి ఉద్వాసన పలికింది. ఇప్పుడు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీకి కూడా ముప్పు పొంచి ఉంది. టీ20లో హిట్ మ్యాన్‌ స్థానంలో హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించే విషయాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. వన్డేలు, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉండగా.. టీ20 కెప్టెన్సీని వేరొకరికి అప్పగించాలి. ఇందుకోసం హార్దిక్ పాండ్యాను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో పాండ్యా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా హార్దిక్ నిరూపించుకుంటే.. త్వరలోనే ఈ ఫార్మాట్‌కు అతడి పేరును కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 

బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. తాము టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కెప్టెన్‌గా హార్దిక్ సరిగ్గా సరిపోతాడని అన్నారు. టీ20 సిరీస్‌కు ముందు సెలక్టర్లు సమావేశమై హార్దిక్‌ను భారత కెప్టెన్‌గా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే సిరీస్‌కు ముందు రోహిత్ స్థానంలో హార్దిక్‌కు కెప్టెన్సీని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అయితే కెప్టెన్సీ మార్పు విషయంపై బీసీసీఐ అధికారిని ప్రశ్నించంగిఆ..'ఇంకా లేదు. ఈ సమాచారం రోహిత్‌కి ఇంకా అందలేదు. టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పుడిప్పుడే తిరిగొచ్చాడు. త్వరలో కోచ్‌ని, కెప్టెన్‌ని సమావేశానికి పిలిపించి దాని గురించి మాట్లాడతాం..' అని సమాధానం ఇచ్చారు. 

చేతన్ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీనియర్ సెలక్షన్ కమిటీని బోర్డు తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చేతన్ శర్మ (నార్త్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబాశిష్ మొహంతి (ఈస్ట్ జోన్)లను వారి పదవుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలనే కెప్టెన్సీ మార్పుపైనా తీవ్రంగా చర్చ నడుస్తోంది. 

Also Read: Satyendra Jain: జైలులో మంత్రికి మసాజ్.. నెట్టింట వీడియో లీక్   

Also Read: Shani Dev: శని దేవుడికి చాలా ఇష్టమైన రాశులు ఇవే.. ఈ రాశువారికి జీవితాంతం డబ్బే..డబ్బు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News