Bangladesh Beat Nedarlands: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. నెదర్లాండ్స్‌ను 9 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ జట్టు 135 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు చేయాల్సిన సమయంలో నెదర్లాండ్స్ 22 పరుగులు చేసి ఓటమి పాలైంది.
హోబర్ట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సౌమ్య సర్కార్, నజ్ముల్ శాంటో జట్టుకుమంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ 5 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. అయితే ఈ సమయంలో నెదర్లాండ్స్ బౌలర్లు విజృంభించడంతో 76 పరుగులకే బంగ్లా సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. ఆ తరువాత ఆసిఫ్ హుస్సేన్ (38 పరుగులు, 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నాడు. అతనికి తోడు శాంటో 20 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేయడంతో చివరి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్, బాస్ డి లీడే తలో రెండు వికెట్లు తీశాడు.
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆదిలోనే బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఎండ్‌లో కోలిన్ అకెర్‌మాన్ ఒంటరి పోరాటం చేశాడు. జట్టును కష్టాల్లో నుంచి గట్టేంచేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు. నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు.
చివరి రెండు ఓవర్లలో నెదర్లాండ్స్ విజయానికి 32 పరుగులు చేయాల్సి ఉంది. 19వ ఓవర్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2 వైడ్‌లతో సహా 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్‌లో నెదర్లాండ్స్‌పై ఒత్తిడి పెరిగింది. చివరి 6 బంతుల్లో విజయానికి 24 పరుగులు చేయాల్సి ఉండగా.. 14 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. హసన్ మహమూద్‌కు 2 వికెట్లు దక్కాయి.
Also Read: Free OTT Movies : ఫ్రీగా ఈ ఓటీటీల్లో సినిమాలు చూసేయండి.. ఎంజాయ్ పండుగో అంటే ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook