Akshar Patel Engagement: అక్షర్​ పటేల్ గుడ్​ న్యూస్​- బర్త్​డే నాడే ప్రేయసితో ఎంగేజ్​మెంట్

Akshar Patel Engagement: యువ క్రికెటర్​ అక్షర్​ పటేల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా తన ప్రేయసితో ఎంగేజ్​మెంట్ జరిగినట్లు స్వయంగా ప్రకటించాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 12:51 PM IST
  • త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న క్రికెటర్​ అక్షర్ పటేల్​
  • తన ప్రేయసితో తాజాగా ఎంగేజ్​మెంట్​
  • సోషల్​ మీడియాలో ఫొటోలు షేర్​ చేసిన యువ క్రికెటర్​
Akshar Patel Engagement: అక్షర్​ పటేల్ గుడ్​ న్యూస్​- బర్త్​డే నాడే ప్రేయసితో ఎంగేజ్​మెంట్

Akshar Patel Engagement: టీమ్​ ఇండియాలో మరో యువ క్రికెటర్​ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆల్​రౌండర్​, స్పిన్నర్​ అక్షర్​ పటేల్​కు తాజాగా ఎంగేజ్​మెంట్ జరిగింది.

తన చిన్ననాటి ప్రియురాలు మేహతో(Akshar Patel GirlFriend Name) గురువారం రాత్రి ఘనంగా ఎంగేజ్​మెంట్ (Akshar Patel Engagement celebrations) వేడుక జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక జరిగింది.

నిజానికి గురువారం (జనవరి 20) అక్షర్​ పటేల్​ 28వ పుట్టిన (Akshar Patel Birthday) రోజు. ఈ సందర్భంగా తన బర్త్​ డేను మమరింత స్పెషల్​గా మార్చుకున్నాడు. పుట్టిన రోజునే తనకు కాబోయో జీవిత భాగస్వామి చేతికి రింగు తొడిగాడు.

తాజాగా తన ఎంగేజ్​మెంట్​కు సంబంధించిన ఫొటోలను అక్షర్ పటేల్​ సోషల్ మీడియాలో (Akshar Patel Engagement Photos) పంచుకున్నాడు.

ఈ పోస్ట్​కు.. 'మా జీవితంలో కొత్త అధ్యాయానికి ఇది ప్రారంభం. ఎప్పటికీ కలిసే ఉంటాయి. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను.' అని రాసుకొచ్చాడు అక్షర్ పటేల్​.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshar Patel (@akshar.patel)

ఈ పోస్ట్​లో తన ఎంగేజ్​మెంట్​ ఫొటోలను కొన్నింటిని అభిమానులతో పంచుకున్నాడు అక్షర్​ పటేల్​. ఇందులో అక్షర్​ పటేల్​, తన ప్రేయసి మెహాకు ప్రపోజ్​ చేస్తున్నట్లు, ఇద్దరు కలిసి తమ ఎంగేజ్​మెంట్ రింగ్స్​ చూపిస్తూ దిగిన ఫొటోలతో (Akshar Patel Engagement news) పాటు.. 'మ్యారీ మీ' అనే బ్యాగ్రౌండ్ ముందు దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.

Also read: T20 World Cup 2022 Schedule: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?! అభిమానులకు పండగే పో!

Also read: IND vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్! సూర్య ఇన్.. వెంకటేష్ ఔట్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News