Australian Cricketer: ఇండియా వీధుల్లో శవాల్ని చూస్తే...తెలుస్తుంది పరిస్థితి ఏంటో

Australian Cricketer: కరోనా మహమ్మారి నేపధ్యంలో ఐపీఎల్ సీజన్ 14 అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఇండియాలో చిక్కుకుపోయారు. ఈ విషయమై ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్‌కు , ఆ దేశ ప్రధానికి మధ్య వివాదం రాజుకుంటోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2021, 10:18 AM IST
Australian Cricketer: ఇండియా వీధుల్లో శవాల్ని చూస్తే...తెలుస్తుంది పరిస్థితి ఏంటో

Australian Cricketer: కరోనా మహమ్మారి నేపధ్యంలో ఐపీఎల్ సీజన్ 14 అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఇండియాలో చిక్కుకుపోయారు. ఈ విషయమై ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్‌కు , ఆ దేశ ప్రధానికి మధ్య వివాదం రాజుకుంటోంది.

ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 14 టోర్నీ(IPL Season 14 Tourney)..కరోనా ఉధృతి నేపధ్యంలో అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. దాంతో వివిధ ఐపీఎల్ జట్లలో ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ( Australian Cricketers) స్వదేశానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.ఈ విషయంలో ఆటగాళ్లను వెనక్కి రప్పించే విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖేల్ స్లేటర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిపై (Australia prime minister)విమర్శలు ఎక్కుపెట్టారు. మానవ సంక్షోభానికి సంబంధించిన అంశంపై ఓ దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉందని మైఖేల్ స్లేటర్ ట్వీట్ చేశారు. ఇండియాలో ఉన్న ప్రతి ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారనేది నిజమని..నీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లి..ఇండియా వీధుల్లో ఉన్న శవాల్ని చూడాలని ట్వీట్ చేశారు మేఖేల్ స్లేటర్( Michael slator). ఈ అశంపై డిబేట్‌కు సిద్ధమని ప్రధానికి సవాలు విసిరారు.

మరోవైపు కరోనా మహమ్మారి(Corona crisis) తో పోరాడుతున్న భారతీయులకు సంఘీభావం తెలిపారు. కరోనాపై మీరు చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిదని..కరోనా నుంచి ప్రతి భారతీయుడు క్షేమంగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఐపీఎల్ కామెంటేటర్‌గా పనిచేసిన తనపై చూపిన ప్రేమను అద్భుతమని కొనియాడారు. ఐపీఎల్ సీజన్ 14లో కామెంటేటర్‌గా పనిచేసిన మైఖేల్ స్లేటర్..కరోనా ఉధృతి నేపధ్యంలో స్వదేశానికి పయనమయ్యారు. ఆస్ట్రేలియాలో భారత్ నుంచి వచ్చేవారిపై మే 15 వరకూ నిషేధముండటంతో ప్రస్తుతం ఆయన మాల్దీవ్స్‌లో ఉన్నారు. అక్కడ్నించి ఆసీస్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. మిగిలిన ఆస్ట్రేలియన్ క్రికెటర్లు కూడా శ్రీలంక మీదుగా మాల్దీవ్స్(Maldives) చేరుకుని...అక్కడి నుంచి ఆస్ట్రేలియా ( Australia) వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Also read: IPL 2021: భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే అతిపెద్ద తప్పిదమంటూ మాజీ కెప్టెన్ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News