Yashasvi Jaiswal Run Out: జైస్వాల్ రనౌట్‌తో కోహ్లీపై నిందలు.. వీడియో చూసి తప్పు ఎవరిదో తేల్చండి

Ind Vs Aus 4Th Test Highlights: ఆసీస్‌తో నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట చివర్లో భారత్ తడపడింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ రనౌట్‌తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 27, 2024, 05:18 PM IST
Yashasvi Jaiswal Run Out: జైస్వాల్ రనౌట్‌తో కోహ్లీపై నిందలు.. వీడియో చూసి తప్పు ఎవరిదో తేల్చండి

Ind Vs Aus 4th Test Highlights: యశస్వి జైస్వాల్ (82) రనౌట్‌తో రెండో రోజు టీమిండియా ఆటతీరు మొత్తం మారిపోయింది. ఆసీస్‌ బౌలింగ్‌కు ధీటుగా సమాధానం ఇస్తున్న తరుణంలో ఊహించని విధంగా జైస్వాల్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్‌ చివర్లో పటష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవెన్ స్మిత్ (147) మరో శతకం బాదాడు. కమిన్స్ (49) ఒక పరుగు తేడాలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2 వికెట్లు పడగొట్టారు.

గత రెండు మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మరోసారి నిరాశ పరిచాడు. కమిన్స్ బౌలింగ్‌లో పేలవమైన షాట్ ఎంపికతో 3 పరుగులకే పెవిలియన్‌కు చేరిపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్, జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే 24 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌ను కమిన్స్‌ ఔట్ చేసి మరోసారి దెబ్బ తీశాడు. అయితే జైస్వాల్‌ ఓ ఎండ్‌లో కుదురుకోగా.. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపు దూసుకువెళ్తుండగా.. ఊహించిన విధంగా రనౌట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 118 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 82 పరుగులు చేశాడు. కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించాడు.

జైస్వాల్ ఔట్ అయిన కాసేపటికే.. విరాట్ కోహ్లీ (36) కూడా ఔట్ అయ్యాడు. బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్‌ దీప్‌ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. రెండో రోజు ఆట మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా.. రెండు వికెట్లకు 153 పరుగులతో ఉన్న భారత్.. చివరి ఐదు నిమిషాల్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ రనౌట్‌లో విరాట్ కోహ్లీ తప్పుందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడిన జైస్వాల్.. వెంటనే సింగిల్ కోసం పరిగెత్తాడు. అవతలి ఎండ్‌లో విరాట్ కోహ్లీ జైస్వాల్‌ను గమనించలేదు. ఫీల్డర్ వైపు చూస్తు.. వెనక్కి వెళ్లిపోయాడు. జైస్వాల్ అలానే వెళ్లిపోయాడు. ఈలోపు బంతి అందుకున్న కమిన్స్.. స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ అలెక్స్ క్వారీ వెంటనే వికెట్లను పడగొట్టాడు. దీంతో జైస్వాల్ నిరాశగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. గత రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో విఫలమైన జైస్వాల్.. ఈ మ్యాచ్‌లో మంచి జోష్‌లో కనిపించాడు. జైస్వాల్ రనౌట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

Also Read: Premi Vishwanath: వంటలక్క కాదు.. సంతూర్‌ మమ్మి.. ఈ కండల వీరుడు ప్రేమీ విశ్వనాథ్‌ కొడుకా..!

Also Read: Toyota 2025 SUV Plans: భారత మార్కెట్‌లోకి టయోటా నుంచి 3 ఎలక్ట్రిక్‌ SUVలు.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook  

Trending News