తన క్రికెట్ కెరీర్లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్న ఇంగ్లండ్ మాజీ కెప్టేన్ అలిస్టర్ కుక్ ఇవాళ ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్‌తో క్రికెట్‌కి గుడ్‌బై చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే అలిస్టర్ కుక్ కెరీర్ నుంచి తప్పుకుంటూ తప్పుకుంటూ.. తన ఖాతాలో మరో రికార్డ్ నమోదు చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఐదుగురు ప్రపంచ క్రికెటర్లలో ఒకరిగా కుక్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ టెండుల్కర్(15921), రికీ పాంటింగ్ (13,378), జె కల్లిస్ (13,289), రాహుల్ ద్రావిడ్(13,288) తర్వాత 12,401 పరుగులతో అలిస్టర్ కుక్ ఐదో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
In his final innings, Alastair Cook passes @KumarSanga2 to become the fifth-highest run-scorer, and the highest scoring left-handed batsman in Test cricket history! Congratulations Chef! 👏#ENGvIND #CookRetires pic.twitter.com/2GxH7NNanj
— ICC (@ICC) September 10, 2018
టెస్ట్ కెరీర్లో అత్యధిక పరుగులు సాధించిన లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మేన్‌లో అలిస్టర్ కుక్ మాత్రమే ఉండటం అతడు సాధించిన మరో గొప్ప ఆల్ టైమ్ రికార్డ్.