Ajaz Patel: టెస్ట్‌ల్లో భారత్‌పై అరుదైన ఘనత సాధించిన కివీస్ స్పిన్నర్‌

IND Vs NZ: టెస్ట్‌ల్లో కివీస్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 12:08 PM IST
Ajaz Patel: టెస్ట్‌ల్లో భారత్‌పై అరుదైన ఘనత సాధించిన కివీస్ స్పిన్నర్‌

IND Vs NZ:  కివీస్ బౌలర్ అజాజ్ పటేల్(Ajaz Patel) టెస్ట్ క్రికెట్లో(Test Cricket) అరుదైన ఘనతను అందుకున్నాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్‌(IND Vs NZ Test Match) తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై వాఖండే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో వృద్ధిమాన్ సాహా, అశ్విన్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో ఈ ఘనతను సాధించాడు. నిన్న శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి మరియు శ్రేయాస్ అయ్యర్‌ వికెట్లను తీశాడు. 

Also Read: IND vs NZ: ముగిసిన తొలిరోజు ఆట.. సెంచరీతో చెలరేగిన మయాంక్! భారత్ స్కోర్ ఎంతంటే?

తన కేరిర్‌లో ఐదు వికెట్లు(Five Wickets) సాధించటం ఇది మూడో సారి.  అయితే ఈ మూడు 5 వికెట్ల హాల్‌ కూడా ఆసియా(Asia)లోనే సాధించడం గమనర్హం. అంతకు ముందు 2012లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ జీతన్‌ పటేల్‌ 4 వికెట్లు సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ 6వికెట్లు కోల్పోతే.. మొత్తం ఆ 6 వికెట్లు కూడా అజాజ్‌ పటేల్‌ తీయడం విశేషం.

ఆసియాలో అత్యధికంగా 5 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్లు:
8 - డేనియల్ వెటోరి (21 టెస్టులు)
5 - సర్ రిచర్డ్ హ్యాడ్లీ (13 టెస్టులు)
3 - టిమ్ సౌథీ(13 టెస్టులు)
3 - అజాజ్‌ పటేల్‌ (7 టెస్టులు)*

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News