Afghanistan crisis: తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో క్రికెట్ పరిస్థితి ఏంటి ?

Afghanistan cricket team future amid Afghanistan crisis: ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్‌లో క్రికెట్‌తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ని ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ భవితవ్యం ఎలా ఉండనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2021, 06:45 PM IST
Afghanistan crisis: తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో క్రికెట్ పరిస్థితి ఏంటి ?

Afghanistan cricket team future amid Afghanistan crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిన తరుణంలో ఇకపై ఆ దేశ క్రికెట్ భవిష్యత్ ఎలా కొనసాగనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్‌లో క్రికెట్‌తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ని ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ భవితవ్యం ఎలా ఉండనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలావుంటే, ఆప్ఘనిస్తాన్ క్రికెట్ భవిష్యత్‌పై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. దుబాయ్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కి (T20 world cup) తమ జట్టు అన్ని విధాల సిద్ధం అవుతున్నట్టు ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టంచేసింది. ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజర్ హిక్మత్ హాసన్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. టి20 వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్‌కి సన్నద్ధం అవడం కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లతో ట్రై సిరీస్‌కి సైతం ప్లాన్ చేస్తున్నట్టు హాసన్ తెలిపారు. 

Afghanistan-Cricket-Team-1-amid-Afghanistan-crisis

ఆప్ఘనిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లు (Afghanistan cricket team) ఇంకొద్ది రోజుల్లో ప్రాక్టీస్ కోసం కాబూల్ చేరుకుంటారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ట్రై సిరీస్‌కి వేదిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే శ్రీలంక, మలేషియా లాంటి దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి అని హిక్మత్ హాసన్ వెల్లడించారు. 

Also read : Attack on KL Rahul: IND vs ENG 2వ టెస్ట్ మ్యాచ్‌లో కె.ఎల్ రాహుల్‌పై శాంపేన్ బాటిల్స్ మూతలతో దాడి

స్వదేశంలోనే డొమెస్టిక్ టీ20 టోర్నమెంట్ ఆడేందుకు సైతం వ్యూహరచనలు చేస్తున్నాం. ఆ టోర్నమెంట్ కూడా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఆఫ్ఘనిస్థాన్ జట్టును సన్నద్ధం చేస్తుందని హిక్మత్ హాసన్ (Hikmat Hassan) తెలిపారు. ఇదిలావుంటే, ఇటీవలే తాలిబన్లు తమ దేశంలో పట్టుపెంచుకుంటుండంపై రషీద్ ఖాన్ (Rashid Khan) స్పందిస్తూ.. ప్రపంచ నేతలారా తమ దేశాన్ని సంక్షోభం నుంచి ఆదుకోండి అని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

Also read : KL Rahul test century: ఇండియా vs ఇంగ్లండ్‌ రెండో టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News