Ganesh Puja: బుధవారం సిద్ధి వినాయకుడిని ఇలా పూజించండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి!

Ganesh Puja: బుధవారం వినాయకుడిని పూజిస్తారు.  వినాయకుడి యెుక్క సిద్ధి వినాయక రూపాన్ని బుధవారం పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2022, 12:39 PM IST
Ganesh Puja:  బుధవారం సిద్ధి వినాయకుడిని ఇలా పూజించండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి!

Wednesday Puja tips: వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతను పూజిస్తారు. బుధవారం వినాయకుడిని పూజించడం అనవాయితీ. ఈ రోజున గణపతిని (Lord Ganesha) భక్తి శ్రద్దలతో పూజిస్తే.. మీ పనిలో ఎటువంటి ఆటంకం కలగదు. అంతేకాకుండా అన్ని రకాల భాదలు  దూరమవుతాయి. బుధవారం వినాయకుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.  

గణపతిని ఇలా పూజించండి
>> గణేశుడికి అనేక అవతారాలు ఉన్నాయి. వాటిలో అష్ట వినాయకుడు అత్యంత ప్రసిద్ధుడు. అయితే బుధవారం సిద్ధి వినాయకుడిని పూజించడం ఉత్తమంగా భావిస్తారు. దీని వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. 
>> పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు సిద్ధతేక్ పర్వతంపై వినాయకుడి యెుక్క సిద్ధి వినాయక రూపాన్ని పూజించడాన్ని నమ్ముతారు. అప్పుడు బ్రహ్మ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ విశ్వాన్ని సృష్టించాడట.
>> గణేశుడి యెుక్క సిద్ధి వినాయక రూపం అత్యంత ప్రజాదరణ పొందినదిగా భావిస్తారు. సిద్ధి వినాయకుడికి రిద్ధి మరియు సిద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. 
>> బుధవారం నాడు, గణపతి యొక్క సిద్ధి వినాయక రూపాన్ని పూజించి.. 21 పత్రాలను సమర్పించండి. 
>> సిద్ధి వినాయకుడిని షోడోపచారాలతో పూజించిన తర్వాత,...ధూపం, దీపాలు వెలిగించండి. అనంతరం గణేష్ చాలీసా పఠించండి. ఇప్పుడు వినాయకుడికి లడ్డూలు నైవేద్యంగా పెట్టి చివరగా హారతి  ఇవ్వండి.  
>> బుధవారం నాడు వినాయకుడిని సక్రమంగా పూజించడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి.

Also Read: Angaraka Yogam: 37 ఏళ్ల తరువాత ఏర్పడిన అంగారక యోగం.. నేటితో ముగింపు.. ఇక ఈ 3 రాశుల వారికి అన్నీ మంచి రోజులే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News