Weekly Horoscope: వచ్చే వారం ఈ నాలుగు రాశుల వారికి డబ్బే డబ్బు.. ప్రమోషన్స్, కోర్టు కేసుల్లో విజయం

Weekly Horoscope from 13 to 19 February, 2023: ఈ నాలుగు రాశుల వారికి  వచ్చే వారం అదృష్టం వరించనుంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవి, ఎవరిని ఆ అదృష్టం వరించనుందో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చదవాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2023, 09:22 PM IST
Weekly Horoscope: వచ్చే వారం ఈ నాలుగు రాశుల వారికి డబ్బే డబ్బు.. ప్రమోషన్స్, కోర్టు కేసుల్లో విజయం

Weekly Horoscope from 13 to 19 February, 2023: ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 19 వరకు రాశిఫలాలు: రాబోయే వారం రోజుల రాశిఫలాల ప్రకారం, ఫిబ్రవరి నెల మూడవ వారం కొంతమందికి వారు ఆశించిన విజయాన్ని అందుకుంటారని తెలుస్తోంది. వారికి అదృష్టం కొద్ది వారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే వృత్తి, వ్యాపారాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవి, ఎవరిని ఆ అదృష్టం వరించనుందో తెలుసుకుందాం.

మేష రాశి : మేష రాశి వారు ఈ వారం తమ పనిలో ఆశించిన విజయాన్ని అందుకుంటారు. వారు మర్యాదగా మాట్లాడితే చాలు.. వారు తలపెట్టిన పనులు సులువుగా పూర్తవుతాయి. అయినప్పటికీ మేష రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. పెట్టుబడులు పెట్టే వారు ఈ వారం రోజుల పాటు ఆచితూచి అడుగేస్తూ నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల నష్టాల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.

వృషభ రాశి : వృషభం రాశి వారికి ఈ వారం రోజులు చాలా శుభప్రదమైనదని వారి జాతకం చెబుతోంది. వృషభ రాశి వారు తమ వృత్తికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలోనూ భారీ లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే స్త్రీలు సమాజంలో మంచి గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు మెరుగుపడుతాయి.

కన్య రాశి : ఈ వారం కన్యారాశి వారికి బాగా కలిసొస్తుంది. ఎప్పటి నుంచో వస్తున్న అనేక సమస్యల బారి నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. కోర్టు కేసులు ఏవైనా ఉంటే.. వాటి తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెట్టుబడిదారులకు లాభం కలుగుతుంది. నచ్చిన వారికి ప్రపోజ్ చేయాలనుకుంటే, ఇదే సరైన సమయం.

తుల రాశి : వచ్చే వారం రోజుల పాటు కన్యా రాశి వారి తరహాలోనే తులా రాశి వారికి కూడా చాలా బాగా కలిసొస్తుంది. వారం ఆరంభంలోనే పెద్ద సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగం, వృత్తితో ప్రజలకు మేలు చేస్తారు. మీకు కీలక పదవి వరించే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సరదాగా గడిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

( గమనిక: ఈ కథనంలో ప్రస్తావించిన అభిప్రాయాలు జ్యోతిష్యుడు చెప్పిన వివరాల ఆధారంగా రాసినవి. ఈ అభిప్రాయాలు, సూచనలతో జీ న్యూస్ ఏ విధంగానూ ఏకీభవించడం లేదు )

ఇది కూడా చదవండి : Money Lines in Hand: చేతిలో ఈ ధన రేఖలు ఉంటే.. మీరు కోటీశ్వరులు కాకుండా ఎవ్వరూ ఆపలేరట

ఇది కూడా చదవండి : Guru Mahadasha: 16 ఏళ్ల గురు మహాదశ, అంతులేని ధన సంపద, జీవితమంతా సుఖ సంతోషాలు

ఇది కూడా చదవండి : Astro Tips: గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే..ఈ కిచెన్ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News