Vinayaka Chavithi 2023: భారత్ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులంతా ఎంతో భక్తితో గణేష్ చతుర్థి పండుగ రోజున వినాయకుడి దేవాలయలను సందర్శిస్తారు. దేశవ్యాప్తంగా ఎన్నో వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. అయితే తమిళనాడులో ఓ గణేషుడి దేవాలయానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. దేశవ్యాప్తంగా ఉండే అన్ని దేవాలయాల్లో ఉండే వినాయకుల విగ్రహాలు తొండాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ ఒక్క ఆలయంలో మాత్రం గణేషుడు మానవ అవతారంలో భక్తులకు దర్శనిమిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆలయం కేవలం ఇప్పటికే ఒక్కటే ఉందని, ఈ ఆలయంలో వినాయకుడు ఎంతో పవర్ ఫుల్ అని అక్కడి భక్తులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఈ దేవాలయాన్ని గణేషుడి దర్శనం కోసం లక్షల మంది భక్తులు వస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని సందర్శించేవారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఇలా భక్తితో ఉపవాసాలు పాటించి ఈ గణేషుడిని పూజించడం వల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడతారని భక్తుల నమ్మకం. ఈ ఆలయం తమిళనాడులో ఎక్కడ ఉందో, ఈ దేవాలయంలో ఉన్న గణేషుడి ప్రత్యేకత ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
ఆదివినాయక దేవాలయం:
ఈ వినాయకుడి ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు ఆదివినాయక దేవాలయం పేరుతో పిలుస్తారు. ఇక్కడ గణేశుడు మానవ రూపంలో దర్శనమిస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ విగ్రహం ప్రపంచంలోని కేవలం ఈ ఆలయంలో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడి బొజ్జ లేకుండా సాధరణమైన శరీరాన్ని కలిగి ఉంటాడు.
మానవ ముఖాన్ని ఎందుకు పూజిస్తారో?:
పార్వతి దేవి స్నానాకి వెళ్లే సమయంలో కాపలాగా వినాయకుడిని ఉంచి వెళ్తుంది. అయితే ఇదే సమయంలో శంకరుడు వస్తాడు. అయితే ఇంటిలోపలి వెళ్లేందుకు గణేషుడు శంకరుడికి అనుమతిని ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురవుతాడు. దీంతో శంకరుడు వినాయకుడి తలను నరుకుతాడు. అయితే పార్వతి దేవి కోరిక మేరకు శంకరుడు వినాయకుడిని రక్షించి మొండెంపై ఏనుగు తలను అమర్చుతారు. అయితే ఈ దేవాలయంలో మాత్రం మొదట ఉన్న మానవ రూపం కలిగిన వినాయకుడిని పూజిస్తారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook