Vijaya Ekadashi 2022 Date: ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో ఏకాదశి రేపు అంటే ఫిబ్రవరి 25 వతేదీన విజయ ఏకాదశిగా పిల్చుకుంటాం. మీ కోర్కెలు నెరవేరాలంటే..విజయ ఏకాదశి నాడు కొన్ని రకాల మంత్రాల్ని పఠిస్తే మీ కోర్కెలు నెరవేరుతాయట. ఆ మంత్రాలు, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
ఫిబ్రవరి 27వ తేదీన అంటే ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షం ఏకాదశి రోజు అంటే విజయ ఏకాదశిగా అందరికీ తెలుసు. ఈ ఏకాదశి రోజున విష్ణువును పూజించి..వ్రతం ఆచరిస్తారు. అలా చేయడం ద్వారా విష్ణువును ప్రసన్నం చేసుకుంటారు. పేరును బట్టే చెప్పేయవచ్చు విజయం ప్రాప్తిస్తుందని. స్వచ్ఛమైన మనస్సుతో పూజిస్తే..మీరు శాస్త్రంపై విజయం సాధించవచ్చు. శ్రీరాముడు..రావణుడితో యుద్ధానికి సిద్ధమైనప్పుడు ముందుగా ఆయన..విజయ ఏకాదశి వ్రతం ఆచరించారని చెబుతారు. ఆ తరువాత ఆయన లంకేశ్వరుడైన రావణుడిపై యుద్ధంలో విజయం సాధించారు. ఈ తరుణంలో విజయ ఏకాదశి నాడు కొన్ని రకాల మంత్రాల్ని పఠించి..మీ మనస్సులోని కోర్కెల్ని నెరవేర్చుకోవచ్చు.
విజయ ఏకాదశి నాడు పఠించాల్సిన మంత్రాలు
ఒకవేళ మీకు మంచి ఉద్యోగం కావాలనుంటే..విష్ణు పూజ చేసే సమయంలో ఓమ్ నారాయణాయ లక్ష్మీ నమ మంత్రాన్ని పఠించాలి. 108 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే ఉద్యోగం లభిస్తుందట.
ప్రత్యేక కోర్కెలు కోరాలనుకుంటే మాత్రం ఓమ్ సియా పతియే రామ్ రామాయ నమ పఠించాలి. దీంతోపాటు శ్రీరాముడు, అతని కుటుంబసభ్యుల్ని కూడా పూజించాలి. ఇలా చేస్తే మనసులో కోరికలు పూర్తవుతాయి.
ఇంట్లో సుఖం సమృద్ధి, సౌఖ్యం ఉండాలంటే ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రాన్ని పఠించాలి. దాంతోపాటు విష్ణువుకు తులసీ పత్రం సమర్పించాలి. ఒకవేళ మీకు గౌరవ మర్యాదలు దక్కాలంటే..ఏకాదశి నాడు సూర్య భగవానుడికి ఎర్రచందనం, బియ్యం వేసి జలాభిషేకం చేయాలి. దాంతోపాటు ఓమ్ సూర్య నారాయనమ మంత్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి.
Also read: Shivratri 2022: శివరాత్రి రోజు ఏ పనులు చేయాలి..? చేయకూడని తప్పులు ఏమిటి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook