Shukra Gochar 2022: నేటి నుంచి 27 రోజుల పాటు.. ఈ ఐదు రాశుల వారికి డబ్బే డబ్బు!

Venus Transit to Aries on May 23 2022, Shukra Gochar 2022. మే 23 రాత్రి శుక్రుడు తన రాశిని మార్చుకుని.. మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్ర సంచారం వల్ల అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 09:10 AM IST
  • మేష రాశిలోకి శుక్రుడు
  • నేటి నుంచి 27 రోజుల పాటు
  • ఈ ఐదు రాశుల వారికి డబ్బే డబ్బు
Shukra Gochar 2022: నేటి నుంచి 27 రోజుల పాటు.. ఈ ఐదు రాశుల వారికి డబ్బే డబ్బు!

Venus Transit to Aries on May 23 2022: జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. సంపద, సౌభాగ్య, శృంగార, శ్రేయస్సు ప్రదాతగా శుక్ర గ్రహాన్ని పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం తన రాశిని నిర్ణీత సమయంలో మారుస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మే 23 రాత్రి శుక్రుడు తన రాశిని మార్చుకుని.. మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న శుక్రుడు ఈరోజు మేష రాశిలోకి వెళతాడు. శుక్ర సంచారం వల్ల అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతాయి. అయితే ఈ 5 రాశుల వారికి మాత్రం ఇక నుంచి చాలా శుభప్రదంగా ఉండనుంది.

మేషం:
శుక్రుని సంచారం మేష రాశి వారికి కెరీర్‌లో ముందుకు సాగడానికి అవకాశాలను కల్పిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. భారీగా ఆదాయం పెరగవచ్చు. కొత్త ఉద్యోగ సూచన ఉంది. ఇంట్లో సంతోషం ఉంటుంది. భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. మీ శృంగార జీవితం కూడా బాగుటుంది. 

మిథునం:
మిథున రాశి వారికి మేష రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆఫీసుల్లో కూడా అంతా మంచే జరుగుతుంది. వ్యాపార రంగంలోని వారికీ శుభకాలం ఉంది. చేతికి డబ్బు వస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడపగలుగుతారు. చాలా కాలం తరువాత కుటుంబ జీవితాన్ని బాగా ఆనందిస్తారు. 

కర్కాటకం: 
ప్రతి రంగంలోని వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు మారవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. బాస్‌తో బాగా కలిసిపోతారు. కొత్త ప్రాజెక్ట్‌లో పనులు ప్రారంభించవచ్చు. వ్యాపారులకు పెద్ద డీల్స్ వస్తాయి. అందరూ కూడా డబ్బు పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

సింహం: 
సింహ రాశి వారికి ఈ 27 రోజులు చాలా మేలు చేస్తాయి. కోరుకున్న ఉద్యోగం మీ సొంత మవుతుంది. మీరు కెరీర్‌లో పురోగతిని పొందవచ్చు. పై అధికారులు మీ పనిని ప్రశంసింస్తారు. ఇంట్లో గతంలోని సమస్య ఇప్పుడు ఇట్టే తీరిపోతుంది. ఆదాయం మీరు ఊహించని రీతిలో పెరుగుతుంది. డబ్బును బాగా పొదుపు చేస్తారు.

తుల: 
శుక్రుని రాశిలో మార్పు తుల రాశి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఒంటరి వ్యక్తులు భాగస్వామిని పొందవచ్చు. ప్రేమ జంట మరియు వివాహిత జంట మధ్య ప్రేమ పెరుగుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. గ్లామర్ ప్రపంచంతో ముడిపడి ఉన్న  వ్యక్తులు గౌరవం మరియు పురోగతిని పొందుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ 27 రోజులు చేతిలో డబ్బు ఉంటుంది. 

Also Read: TS 10th Exams 2022: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు షురూ.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే!

Also Read: Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News