హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీని ప్రభావం వివిధ రాశులపై పడుతుంటుంది. కొన్నింటిపై అనుకూలంగా ఉంటే..మరి కొన్నింటిపై ప్రతికూలంగా ఉంటుంది. ఇందులో భాగంగానే శుక్రుడి మీనరాశి ప్రవేశం ముఖ్యంగా 4 రాశుల జీవితాలపై తీవ్ర దుష్పరిణామాలకు కారణం కానుంది. తీవ్ర కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది.
శుక్ర గ్రహం బుధవారం అంటే ఫిబ్రవరి 15వ తేదీన మీనరాశిలో ప్రవేశించాడు. ఈ రాశిలో శుక్రుడు 25 రోజులు అంటే మార్చ్ 11 వరకూ ఉండనున్నాడు. ఇప్పటికే మీనరాశిలో బృహస్పతి అంటే గురుడు ఉండటం వల్ల రెండు శక్తివంతమైన గ్రహాలతో యుతి ఏర్పడనుంది. ఈ యుతి ప్రభావం 4 రాశులవారికి రానున్న 25 రోజులు అత్యంత కష్టంగా ఉంటుంది. చాలా ఆలోచించి..రోజులు గడపాల్సి వస్తుంది. లేకపోతే ఏదైనా జరగానిది జరగవచ్చు. ఆ రాశులేంటనేది తెలుసుకుందాం..
శుక్ర గోచారం 2023 దుష్ప్రభావం ఈ రాశులపై ఇలా..
తులా రాశి
శుక్రుడి గోచారం ఈ రాశివారికి ఆరోగ్యపరంగా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. తక్షణం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం కాపాడుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ యోగా చేయడం మంచిది. ధననష్టం సంభవించవచ్చు. అందుకే డబ్బులు ఆదా చేయండి. వృధా ఖర్చులకు వెళ్లవద్దు.
మేషరాశి
ఈ గోచారం కారణంగా ఈ రాశివారికి ఆర్ధిక పరిస్థితి దెబ్బతింటుంది. అనుకోని పనులకై డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాంతో మీ నెలసరి బడ్జెట్ అటూ అటూ అవుతుంది. సీజన్ మార్పు కారణంగా ఆరోగ్యం వికటించవచ్చు. ఆహారపు అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే తీవ్ర నష్టం కలగవచ్చు.
కుంభరాశి
కుంభరాశిలో సూర్యుడు, శని యుతి నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రుడి గోచారం తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. రానున్న 25 రోజులు మీకు అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. ఆఫీసులో సీనియర్లు, బాస్‌తో మంచి సంబంధాలు కలిగి ఉంటే మంచిది. వృధా ఖర్చులకు పూర్తిగా దూరంగా ఉండాలి.
మిథునరాశి
శుక్ర గోచారం మీ కెరీర్‌లో చాలా సమస్యలకు కారణమౌతుంది. మీరు పనిచేసే చోట సహచరులతో కలిసి కెరీర్ విషయంలో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మీ పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. కష్టకాలం కావడంతో మీ ప్రత్యర్ధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగం ఇబ్బందిలో పడవచ్చు. అందుకే మీరు శాంతంగా ఉండి 25 రోజులు జాగ్రత్తగా నెట్టుకురావాలి.
Also read: Mercury transit 2023: బుధ గోచారంతో ఈ 8 రాశులకు తిరగనున్న దశ, భారీగా లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook