Shukra Gochar 2022: తులరాశిలోకి శుక్రుడు.. మరో 9 రోజుల్లో మారనున్న ఈ రాశుల ఫేట్..

Shukra Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం మరో 9 రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని సంచారం వల్ల మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2022, 12:49 PM IST
Shukra Gochar 2022: తులరాశిలోకి శుక్రుడు.. మరో 9 రోజుల్లో మారనున్న ఈ రాశుల ఫేట్..

Shukra Gochar 2022: అంతరిక్షంలో గ్రహాల రాశిచక్రం మార్పు అనేది ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. సంపద, ఆనందం, ప్రేమ, శృంగారం, లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం శుక్రుడు కన్యారాశిలో ఉన్నాడు. అక్టోబరు 18న శుక్రుడు తులరాశిలోకి (Venus Transit In libra 2022) ప్రవేశిస్తాడు. దీపావళికి ముందు శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి కలిసి రానుంది. తులరాశిలో శుక్ర సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.

శుక్ర సంచారం ఈ రాశులకు శుభప్రదం
కన్య (Virgo): తులారాశిలో శుక్రుని సంచారం కన్యా రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో విజయాన్నిస్తుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఊహించనంత డబ్బు మీకు అందుతుంది. మార్కెటింగ్, టీచింగ్, యాంకరింగ్, రాజకీయాలు మొదలైన వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సమయం కలిసి వస్తుంది. 
ధనుస్సు (Sagittarius): శుక్రుని రాశిలో మార్పు ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీడియా, గ్లామర్, ఫ్యాషన్ డిజైనింగ్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో లక్ మీ వెంటే ఉంటుంది. 
మకరం (Capricorn): శుక్ర గ్రహం తులారాశిలోకి ప్రవేశించడం వల్ల మకర రాశి వారికి మేలు జరుగుతుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. పూర్వీకుల ఆస్తుల నుంచి మీరు లాభం పొందుతారు. 

Also Read: 'పంచ మహాపురుష రాజయోగం' చేయబోతున్న గురుడు.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News