Shukra Gochar November 2022: ప్రేమ, సంపద మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. రేపు అంటే నవంబరు 11వ తేదీ రాత్రి 7.52 నిమిషాలకు శుక్రుడు తులరాశిని విడిచిపెట్టి వృశ్చికరాశిలో సంచరించనున్నాడు. ఈ శుక్ర సంచారం (Venus transit in Scorpio 2022) వల్ల కొన్ని రాశులవారు లాభపడగా.. మరికొందరు నష్టపోతారు. వృశ్చికరాశిలో శుక్ర సంచారం ఏ రాశివారికి శుభప్రదమో, ఏరాశివారికి అశుభమో తెలుసుకుందాం.
శుక్రుడి సంచారం ఈ రాశులకు లాభం
మిధునరాశి (Gemini): ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. దీంతో ఈరాశివారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోనున్నారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు చెడిపోయే అవకాశం ఉంది. వివాహితులు సమస్యలను ఎదుర్కోంటారు. మీ రాశి యెుక్క ఐదు, పన్నెండవ గృహాలకు అధిపతి శుక్రుడు.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి యెుక్క నాల్గవ మరియు పదకొండవ ఇంటికి శుక్రుడు అధిపతి. సంచార సమయంలో శుక్రుడు మీ జాతకంలో ఐదవ ఇంట్లో ఉంటాడు. దీని వల్ల విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి.
శుక్రుడి సంచారం ఈ రాశులకు నష్టం
సింహరాశి (Leo): ఈ రాశి యెుక్క మూడవ మరియు పదవ ఇంటికి శుక్రుడు అధిపతి. సంచార సమయంలో శుక్రుడు మీ జాతకంలోని నాల్గవ ఇంట్లో ఉంటాడు. శుక్రుని సంచారం మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు నెలకొంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అయితే ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
తులారాశి (Libra): శుక్రుడి సంచార సమయంలో పెట్టుబడి ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ధన లాభాలు కూడా ఉండవచ్చు. ఆదాయ వనరులు కూడా పెరగవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరాశికి శుక్రుడు అధిపతిగా ఉండటంతో పాటు ఎనిమిదవ ఇంటికి కూడా అధిపతి. అతను మీ జాతకంలో రెండవ ఇంట్లో సంచరిస్తాడు. అంతేకాకుండా ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా లాభాలు ఉంటాయి.
Also read: Jupiter Planet: త్వరలో అరుదైన యోగం... ఈ రాశుల కోరిక నెరవేరడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook