Venus Transit 2022: సింహరాశిలోకి శుక్రుడు... ఆగస్టు 31 నుండి ఈ రాశులవారికి ఇబ్బందులు!

Venus Transit 2022: రేపు శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రతికూలంగా ఉండనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 04:55 PM IST
Venus Transit 2022: సింహరాశిలోకి శుక్రుడు... ఆగస్టు 31 నుండి ఈ రాశులవారికి ఇబ్బందులు!

Shukra Gochar in Leo 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల కదలిక ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. రేపు అంటే ఆగస్టు 31న శుక్రగ్రహం కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి (Venus Transit in leo 2022) ప్రవేశించనుంది. శుక్రుడు...ప్రేమ, అందం, ఆనందం, లగ్జరీ లైఫ్, శృంగారానికి కారుకుడిగా భావిస్తారు. శుక్రుడి యెుక్క రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ.. మరికొన్ని రాశులవారికి అశుభంగానూ ఉంటుంది. సింహరాశిలో శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.

ఈ రాశుల వారు జాగ్రత్త..
మిథునం (Gemini): మిథున రాశి వారికి శుక్రుని సంచారం శ్రేయస్కరం కాదు. ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా సమస్యలు రావచ్చు.
కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారికి ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. దీంతో మీరు ఇబ్బంది పడవచ్చు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.  
కన్య (Virgo): కన్యారాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదం కాదు. రానున్న 15 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం పెట్టుబడికి అనుకూలమైన సమయం కాదు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. 
మకరం (Capricorn): శుక్రుని రాశిమార్పు మకరరాశి వారి కెరీర్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ సమయంలో చాలా సమస్యలు రావచ్చు కాబట్టి వారు తమ కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొన్ని చెడు వార్తలు వింటారు. 

Also Read: Lord Ganesh: వినాయకుడి పుట్టుక వెనుకున్న ఆసక్తికర కథ ఇదే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News