Venus Transit 2022: సింహరాశిలో శుక్రుడు సంచారం... ఈ రాశులవారు శుభవార్తలు వినడం పక్కా!

Venus Transit 2022: ఆగస్టు 31న శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. దీని సంచారం ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 10:07 AM IST
Venus Transit 2022: సింహరాశిలో శుక్రుడు సంచారం... ఈ రాశులవారు శుభవార్తలు వినడం పక్కా!

Venus Transit 2022: ఆగస్టు 31న శుక్రుడు కర్కాటక రాశి నుండి సింహరాశికి మారతాడు. శుక్రుడు ఆ రాశిలోనే సెప్టెంబరు 24 వరకు ఉంటాడు. సింహరాశిలో శుక్రుడి యెుక్క ఈ సంచారం (Venus Transit in Leo 2022) ఎనిమిది రాశులవారికి అంతులేని సంపదను, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అందించనుంది. శుక్రుడు ఏ రాశివారిపై వరాల జల్లు కురిపించనున్నాడో తెలుసుకుందాం.

ఈ రాశులవారికి శుభప్రదం

మేషం (Aries)- మీరు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. ఈ సమయంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు.  వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది.
వృషభం (Taurus)- శుక్రుడి సంచారం వల్ల మీ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. 
మిథునం (Gemini)- ఏదైనా సంస్థ నుండి గౌరవం, అవార్డు లేదా పురస్కారం అందుకుంటారు. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్‌లో పేరు రావచ్చు. ఆగిపోయిన ప్రభుత్వ పనులు పూర్తి చేస్తారు. అన్నదమ్ముల నుండి కొన్ని శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం (Cancer)- ఈ సమయం మీకు కలిసి వస్తుంది. మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోతే అది తిరిగి పొందుతారు. మీరు అనేక రకాలుగా డబ్బు పొందుతారు. 

సింహం (Leo)- శుక్రుడు ఈ రాశిలో సూర్యునితో కలిసి ఉంటారు. ఈ రాశివారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడిని కలుస్తారు. మీరు తండ్రి మరియు బాస్ నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. కెరీర్‌లో కొన్ని పనులు నిలిచిపోతాయి. 
తుల (Libra)- మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోతే అది తిరిగి లభిస్తుంది. కొత్త జాబ్ వస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. 
ధనుస్సు (Sagittarius)- ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు. ప్రేమికుల మధ్య అండర్ స్టాండింగ్ పెరుగుతుంది. ఆరోగ్య కుదుటుపడుతుంది. 
మకరం (Capricorn)- పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చిక్కుకున్న డబ్బు పొందుతారు. శుభవార్తలు వింటారు. 

Also Read: September 2022 Horoscope: సెప్టెంబర్ నెల అదృష్ట రాశులు ఇవే...! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News