Venus transit 2023: కుంభంలో శుక్ర సంచారం... ఈ రాశులకు కష్టకాలం.. ఇందులో మీరున్నారా?

Shukra Gochar 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి గోచారం వల్ల ఏ రాశులవారికి సమస్యలు పెరగనున్నాయో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 04:18 PM IST
Venus transit 2023: కుంభంలో శుక్ర సంచారం... ఈ రాశులకు కష్టకాలం.. ఇందులో మీరున్నారా?

Shukra Gochar 2023: లవ్, రొమాన్స్, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడో వారికి దేనికీ లోటు ఉండదు. ప్రస్తుతం శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి రాశి పరివర్తనం కారణంగా కొన్ని రాశులవారు శుభ ఫలితాలను పొందితే.. మరికొన్ని రాశులవారు ప్రతికూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్ర సంచారం సమయంలో ఈ రాశులవారు జాగ్రత్త
కన్యా రాశి(Virgo): ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీకు ప్రత్యర్థుల నుండి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇతరులతో ఆచితూచి మాట్లాడండి. శుక్రుని సంచారం వల్ల మీరు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. కాబట్టి మీ లైఫ్ పార్టనర్ తో సంయమనంతో వ్యవహారించండి. వ్యాపారులు, ఉద్యోగులు నష్టపోయే  అవకాశం ఉంది. 
కర్కాటకం (Cancer): మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం  ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు ఈ సమయం అంతగా కలిసి రాదు. మీరు ఏ పని చేపట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి.

Also Read: Gajakesari Yoga: మీన రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులవారికి ఊహించని ధనలాభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News