Venus Planet Transit In Kumbh 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట వ్యవధిలో తన రాశిచక్రాన్ని మారుస్తుంది. కీర్తి, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు త్వరలో కుంభరాశిలోకి (Shukra Gochar 2023) ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఇది కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. శుక్ర సంచారం వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కుంభం (Aquarius): శుక్రుని సంచారం మీకు ఆర్థికంగా లాభిస్తుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ జాతకంలోని లగ్న గృహంలో సంచరించబోతోంది. అందుకే ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తోచేసే పనుల్లో మీకు లాభాలు మెుండుగా ఉంటాయి.
తులా రాశిచక్రం (Libra): తులారాశి వారికి శుక్రుని సంచారం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి యెుక్క ఐదో ఇంట్లో సంచరించనుంది. మీ ప్రేమ ఫలిస్తుంది. మీరు ఉన్నత విద్యలో ప్రవేశించే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వృశ్చిక రాశిచక్రం (Scorpio): శుక్రుని సంచారం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంటిలో సంచరించబోతోంది. ఈ సమయంలో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఫ్యామిలీతో మీ సంబంధం గట్టిపడుతుంది.
Also Read: Surya Sankranti 2023: సూర్య సంక్రాంతి ఈ 4 రాశులకు అదృష్టాన్ని ఇస్తుంది.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.