Shukra Gochar 2023: హోలీ తర్వాత ఈ 5 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?

Shukra Gochar 2023: శుక్రుడు మార్చి 12న మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. హోలీ తర్వాత ఈ రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 06:55 PM IST
Shukra Gochar 2023: హోలీ తర్వాత ఈ 5 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?

Shukra-Rahu Yuti 2023: అందం, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. అనంతరం మార్చి 12న మేషరాశికి (venus transit in Aries 2023) వెళతాడు. రాహువు ఇప్పటికే మేషరాశిలో సంచరిస్తున్నాడు. హోలీ తర్వాత శుక్రుడు మేషరాశిలోకి వెళ్లటం వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
మేషరాశి
ఇదే రాశిలోకి శుక్రుడి ప్రవేశిస్తుండటం వల్ల మేషరాశివారు బాగానే లాభపడతారు. మీ వ్యక్తిత్వంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. లవ్ లైవ్ బాగుంటుంది. భార్యభర్తల మధ్య బంధం గట్టిపడుతుంది. 
మిధునరాశి
మిథునరాశి వారికి కూడా శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం అద్బుతంగా ఉండబోతుంది. 
సింహరాశి 
శుక్రుని సంచారం సింహ రాశి వారికి లాభాలను ఇస్తుంది. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. జాబ్ కోసం ఎదురుచూసే వారి కల ఫలిస్తుంది. 
ధనుస్సు రాశి 
ధనుస్సు రాశి వారికి శుక్ర సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పాత వివాదాలు ముగిసిపోతాయి. డబ్బు సమస్యలు తీరుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
మీనరాశి
మీన రాశి వారికి శుక్రుడు అనుగ్రహం లభిస్తుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీ అత్తమామలతో సంబంధాలు బాగుంటాయి. మీరు మీ మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. 

Also Read: Falgun Purnima 2023: ఫాల్గుణ పూర్ణిమ ఎప్పుడు? స్నాన-దాన ముహూర్తం తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News