Vat Savitri Vrat 2023 Date: వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం వట్ సావిత్రి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితిగా వస్తోంది. జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున వట్ సావిత్రి వ్రతం పాటిస్తారు. అంతేకాకుండా ఈ అమావాస్యను శని జయంతి అని కూడా అంటారు. వట్ సావిత్రి వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శని దేవుడినికి ఉపవాసం పాటించడం వల్ల కూడా విశేష ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అమావాస్య ఎలాంటి నియమాలు పాటించి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జ్యేష్ఠ మాసంలోని అమావాస్య ఈ రోజే:
వట్ సావిత్రి వ్రతాన్ని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున పాటిస్తారు. ఈ ఏడాది అమావాస్య తిథి మే 18వ తేదీ రాత్రి 9.42 గంటలకు ప్రారంభమై మే 19వ తేదీ రాత్రి 9.22 గంటలకు ముగుస్తుంది. అందుకే మే 19న ఉపవాసాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
శుభ యోగాలు కూడా ఏర్పడుతాయి:
శని జయంతి రోజునే వట్ సావిత్రి వ్రతం పాటించాల్సి ఉంటుంది. ఇదే రోజున సిద్ధ యోగం ఏర్పడుతుంది. కాబట్టి అన్ని రాశులవారి జీవితాల్లో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీనితో పాటు శని తన సొంత రాశి కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది. చంద్రుడు బృహస్పతితో పాటు మేషరాశిలో సంచార దశలో ఉన్నప్పుడే గజకేసరి యోగం ఏర్పుడుతుంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నమ్ముతారు.
వ్రతం ఆరాధన విధానం:
భారత్‌లో వట్ సావిత్రి వ్రతం రోజున మర్రి చెట్టును పూజిస్తారు. ఈ చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు దేవతలు నివసిస్తారని, ఈ చెట్టును పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్రతాన్ని స్త్రీలు పాటించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజున మహిళలు మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రక్షా సూత్రాన్ని భక్తి శ్రద్ధలతో కట్టడం వల్ల భర్త దీర్ఘకాలం ఆయుష్షు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సంతానం లేనివారికి సంతానం కూడా కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వ్రతాన్ని పాటించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.