Vastu Tips: ఇంటి మెయిన్ డోర్ ఆ దిశలో ఉంటే అడక్కు తినాల్సిందేనట.. వాస్తు ప్రకారం ఏ దిక్కు సరైనదంటే..

Vastu Tips: ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇంట్లోకి అడుగుపెట్టే దిశ కూడా అందులో ఉండేవాళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఒకే వేళ మీ జాతకంలో ఈ గ్రహం అనుకూల స్థానంలో లేకుంటే.. ఆ దిశలో  సింహ ద్వారం ఉంటే మీకు హానికరంగా పరిగణించబడుతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 6, 2024, 11:42 AM IST
Vastu Tips: ఇంటి మెయిన్ డోర్ ఆ దిశలో ఉంటే అడక్కు తినాల్సిందేనట.. వాస్తు ప్రకారం ఏ దిక్కు సరైనదంటే..

Vastu tips: గత కొన్నేళ్లుగా ఇంటి విషయంలో చాలా మంది వాస్తును ఫాలో అవుతున్నారు. ఇది ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో మన పెద్దలు తమ ఇళ్లతో పాటు ఇంట్లో బావి, గొడ్ల చావిడి, పొలం విషయంలో వాస్తును ఫాలో అవుతూనే ఉన్నారు. అది అనాదిగా మనకు వస్తున్న ఆచారం. ఒక వ్యక్తి జీవితంలో కుజ స్థానం బాగాలేకపోతే.. తూర్పు దిశలో ఉన్న తలుపు మీకు హాని చేస్తుంది.

ఇల్లు అయినా.. వర్క్ ప్లేస్ అయినా.. మనందరం వాస్తు నియమాల ప్రకారమే నడుచుకోవాలి. వాస్తు నియమాలను సరైన పద్దతిలో పాటిస్తే అనేక సమస్యలకు చెక్ పెట్టేచ్చు. మనిషికి గుండె ఎంత ముఖ్యమే.. ఇంటికి ప్రధాన ద్వారం కూడా అంతే ముఖ్యం. అది సరైన దిశలో లేకపోతే.. అందులో నివసించే వారు అనే రకాల రుగ్మతలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంటి తలుపు సరైన దిశలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టానికి తిరుగుండదు.

సాధారణంగా చాలా మంది తూర్పు, ఉత్తరం దిశలో ద్వారం ఉన్న ఇంటిని శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిశలో తలుపు ఉన్నప్పటికీ కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. తలుపు యెక్క దిశ జాతకంతో ముడిపడి ఉంటుంది. వ్యక్తి జాతకంలో కుజుడు సరైన స్తానంలో లేకుంటే.. తూర్పు దిశలో తలుపు ఉన్న ఇల్లు ఆ జాతకుడికి కొన్ని అరిష్టాలను కలిగిస్తుంది. అదే పశ్చిమ దిశలో ఉంటే.. అనుకోని డబ్బు ప్రవాహాం ఉంటుంది. ఆర్ధికంగా లోటు ఉండదు.

మీ జాతకం ప్రకారం బుధుని స్థానం సరిగా లేకుంటే.. ఆ వ్యక్తి సమస్యల వలయంలో చిక్కుకుంటారు. కాబట్టి సరైన వాస్తు పండితులను పిలిపించి తన జాతక చక్రం ప్రకారం తలుపు ఏ దిశలో ఉండాలనేది డిసైడ్ చేయాలి.

వీటి వల్ల కూడా మనుషుల జీవితంలో సమస్యలు వస్తుంటాయి..

ఒక వ్యక్తి యొక్క ఇంట్లో ఉత్తరం వైపు తలుపు ఉంటే.. అది అతని ఉన్నతికి దారి తీస్తుంది. తలుపు ముందు పెద్ద గోడ వుంటే మాత్రం ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయవచ్చు. అది కాకుండా తలుపు దక్షిణ దిశలో ఉంటే.. అది వాస్తు ప్రకారం మంచిది కాదు. జాతకంలో కుజుడు, శని దేవుడి స్థానాలు సరైన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ వాస్తు నియమాలపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టండి..

ఇంట్లో తలుపు ఆగ్నేయ దిశ అంటే.. తూర్పు దక్షిణం మధ్యలో ఉంటే.. ఆ తలుపు ఉన్న యజమానికి సంపదతో పాటు సమాజ శ్రేయస్సు పెంచుతుంది. అదే ఆగ్నేయం, ఈశాన్య దిశలో ఉంటే అది నష్టాన్ని కలిగిస్తోంది. కాబట్టి వాస్తు ప్రకారం ఈ దిశ శుభ ప్రదంగా పరిగణించబడుతోంది. మీ జాతకంలో బృహస్పతి సరిగ్గా లేకుంటే అనేక కష్టనష్టాలను చుట్టుముడతాయి.

ఇదీ చదవండి: Tirumala Tirupati Devasthanam: ఈ నెల తిరుమల వెళ్లేవారికి బిగ్అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!

ఇదీ చదవండి: Budh Gochar 2024: మరో ౩ రోజుల్లో ఈ రాశికి బ్యాడ్ టైం స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News