Vastu Tips for Plants: ఇంట్లో ఈ మొక్కలు ఇలా పెంచితే ఇక ఆ ఇంట్లో నాన్‌స్టాప్ ధన ప్రవాహం

Vastu Tips for Plants: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి ఉన్నట్టే వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఏది ఎక్కడ, ఎలా ఉండాలనే నియమ నిబంధనలుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 17, 2023, 06:31 AM IST
Vastu Tips for Plants: ఇంట్లో ఈ మొక్కలు ఇలా పెంచితే ఇక ఆ ఇంట్లో నాన్‌స్టాప్ ధన ప్రవాహం

Vastu Tips for Plants: చాలామంది ఇళ్లలో మొక్కలు పెంచుకుంటుంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల ఆ ఇంటికి మంచి జరుగుతుందని విశ్వాసం. ఇంట్లో మొక్కలుంటే ఇంటి ఎనర్జీపై ప్రభావం పడుతుందని నమ్మకం. ఇంట్లో ఈ మొక్కలుంటే ఆ ఇంట ధన వైభోగం, సుఖం, ప్రశాంతత అన్నీ లభిస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలి, ఎలాంటివి దూరంగా పెట్టాలనే వివరణ ఉంది. వాస్తవానికి మొక్కలు లేదా చెట్లు అనేవి సానుకూల, ప్రతికూల ప్రభావానికి కారణమౌతాయి. అందుకే ఇంటి లోపల, బయట, ఇతర ప్రాంతాల్లో శుభాన్ని కల్గించే అంటే లక్కీ ప్లాంట్స్ పెంచాలంటారు. ఇంట్లో ఈ లక్కీ ప్లాంట్స్ ఉంటే ఈ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లో ధనలక్ష్మి రాక ఉంటుంది. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు లభిస్తాయి. ఏ వస్తువుకు లోపముండదు. 

షమీ ప్లాంట్‌కు వాస్తుశాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ మొక్క శని గ్రహానికి అత్యంత ఇష్టమైంది. ఈ మొక్కను ఇంటి మెయిన్ గేట్ వద్ద ఉంచాలంటారు. దీనివల్ల మూసుకుపోయిన అదృష్టం కాస్తా తెర్చుకుంటుంది. డబ్బులతో పాటు గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. శని దేవత కటాక్షంతో అంతులేని డబ్బులు వచ్చిపడతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించడంతో..ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది.

జాస్మిన్ ప్లాంట్. సువాసనలు వెదజల్లే మల్లెపూల మొక్క. ఇంట్లో ఈ మొక్క ఉంటే ఆ ఇళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందంటారు. మల్లె మొక్కతో ఇంట్లో ధనం వచ్చి పడుతుంది. ధన దేవత లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. 

వాస్తు శాస్త్రం ప్రకారం పామ్ టీ కూడా చాలా మంచిదంటారు. ఇంటి ముఖ ద్వారం వద్ద పామ్ ట్రీని ఉంచాలి. పాజిటివ్ ఎనర్జీ కారణంగా మంచి ప్రతిఫలం లభిస్తుంది. పామ్ ట్రీతో సహజసిద్దమైన ఎయిర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఆదాయంలో వృద్ధి కన్పిస్తుంది. 

వాస్తు ప్రకారం ఇంట్లో ఉండాల్సిన మరో మొక్క ఫర్న్ ప్లాంట్. ఇది అందంగా ఉండటం వల్ల ఇంటికి ఆకర్షణగా ఉంటుంది, ఇంటి ముఖ ద్వారం వద్ద అమర్చితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందంటారు. ఫలితంగా ఆ ఇంట్లో ధన సంపదలు కలుగుతాయి. అన్నింట్లో వృద్ది ఉంటుంది. 

మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మొక్క ఇంట్లో చాలా ఇష్టంగా, నమ్మకంగా పెంచుకుంటుంటారు. పేరులోనే డబ్బుంది. ఈ మొక్క పెంచడం వల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుందంటారు. ఇంటి పరిస్థితులు కూడా వృద్ధి చెందుతాయి. ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయి. మనీ ప్లాంట్ ఎదిగేకొద్దీ ఇంట్లో డబ్బులు పెరుగుతుంటాయని బలమైన నమ్మకం. 

ఇక ప్రతి హిందువు ఇంట్లో తప్పకుండా ఉండే మొక్క ఇది. కేవలం వాస్తుపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా మహత్యం కలిగిన తులసి మొక్క ఇది. తులసి మొక్కను ధనదేవత లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఇంటి ముఖ్య ద్వారం వద్ద ఈ మొక్కను అమర్చుకుంటే ఆ ఇంట్లో పాజిటివ్ పరిణామాలుతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవు.

Also read: Sun Transit 2023: ఇవాళే సూర్య గోచారం, ఈ మూడు రాశులకు కొత్త ఉద్యోగాలు, ధనలాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News