Vastu tips for Money: ఇంట్లో డబ్బు ఉంచే ప్లేస్ లో ఇలా చేస్తే .... మీపై డబ్బు వర్షమే..!

Vastu Tips:  డబ్బుకు సంబంధించిన అనేక చిట్కాలను వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి. మీ లాకర్ లేదా ఖజానా ఉంచే స్థలంలో ఈ వస్తువులను ఉంచడం ద్వారా మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2022, 08:49 AM IST
Vastu tips for Money: ఇంట్లో డబ్బు ఉంచే ప్లేస్ లో ఇలా చేస్తే .... మీపై డబ్బు వర్షమే..!

Vastu Tips for Money:  ప్రతి మనిషి దేనికీ లోటు లేకుండా హ్యాపీగా జీవించాలని కోరుకుంటాడు. దీని కోసం చాలా కష్టపడి డబ్బు  సంపాదిస్తాడు. అయినప్పటికీ అతడి దగ్గర డబ్బు నిలువదు. దీనికి కారణం వాస్తు కావచ్చు. ఈ రోజు మనం అలాంటి కొన్ని విషయాలు (Vastu tips for Money) గురించి చెప్పుకుందాం. ఇది చేసిన తర్వాత మీ ఇంట్లో ఎప్పుడు డబ్బుకు కొరత ఉండదు. మీ లైఫ్ బిందాస్ ఉంటుంది. 

ఇలా చేస్తే మీకు డబ్బుకు లోటు ఉండదు..
>> ఇంట్లో 7 గవ్వలను శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచండి. ఇది ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది మరియు డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది. 
>>వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో లాకర్ లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో కొన్ని నోట్లు లేదా ఒక నోటును ఉంచడం వల్ల డబ్బుకు కొరత ఉండదు. అయితే ఈ నోట్లు పాతవి లేదా కొత్తవి కాకుండా చూసుకోండి. వాటిని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచాలి.
>> సంపదకు దేవుడు కుబేరుడు. ఈ కుబేరుడి విగ్రహాన్ని లాకర్, ఖజానా లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. దీంతో భారీగా డబ్బు రావడంతోపాటు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
>>ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఉండకూడదంటే ఖజానా లేదా లాకర్‌లో అద్దం ఉంచండి. మీరు తలుపు తెరిచినప్పుడల్లా మీకు కనిపించే విధంగా అద్దాన్ని సెట్ చేసుకోండి.  దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 
>> పనికిరాని వస్తువులను ఎప్పుడూ సేఫ్ లేదా లాకర్‌లో ఉంచవద్దు. లాకర్‌లో డబ్బు లేదా దానికి సంబంధించిన వస్తువులను మాత్రమే ఉంచాలి.

Also Read: Shani Margi 2022: మకరరాశిలో శని సంచారం.. అక్టోబరు 23 నుంచి ఈరాశుల వారికి అంతులేని ధనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News