Vastu Tips for Home: వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని మొక్కలు ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని (Negativ Energy) తొలగించి పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తాయి. కరక్కాయ, శమీ, తులసి మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుంది. వీటితో పాటు గుల్మకాండ మొక్క కూడా శుభప్రదమని వాస్తు శాస్తం చెబుతోంది. ఈ మొక్కకు ఉన్న దైవిక స్వభావం కారణంగా ఇంట్లోని వివాదాలు, గొడవలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.
ఇది లక్ష్మీదేవి, విష్ణువులకు ప్రీతికరమైన మొక్క
వాస్తు శాస్త్రం (Vastu Shastra) ప్రకారం.. అరేనా మొక్క చాలా పవిత్రమైనది. సాక్షాత్తు మహా విష్ణువు ఈ మొక్కలో కొలువై ఉంటాడని నమ్ముతారు. అరేనా మొక్కలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తెలుపు, మరొకటి పసుపు. ఇందులో తెల్లటి పూలు పూసే అరేనా మొక్క లక్ష్మీదేవి, విష్ణువులకు ప్రీతికరమైనదిగా చెబుతారు. అరేనా మొక్క ఏడాది పొడవునా పూలు పూస్తుంది. ఈ మొక్క ఉన్నచోట ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లోని ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగిస్తుంది. ఇంటికి తూర్పు లేదా ఈశాన్య మూలలో ఈ మొక్కను నాటాలని చెబుతారు.
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే..
వాస్తు శాస్త్రం ప్రకారం... ఇంట్లో కనేర్ మొక్కను (Kaner Flower) పెట్టుకోవడం, దాని పూలతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆ ఇంట్లో సంతోషం కలుగుతుంది. అంతేకాదు లక్ష్మీ దేవీ కటాక్షం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే ఎలాంటి శుభకార్యాలైనా ఆటంకం లేకుండా నెరవేరుతాయి.
ఆ మొక్కలతో జాగ్రత్త :
అరెకోనాట్ మొక్కలు (Plants in Home) అనేక రకాల వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయి. అయితే దాని పువ్వులు, విత్తనాలు విషపూరితమైనవి అని గుర్తుంచుకోండి. కాబట్టి చిన్నపిల్లలు ఆ మొక్క దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
Also Read: Video: విష సర్పాన్నే బెంబేలెత్తించిన తల్లి ఎలుక.. పిల్ల ఎలుక కోసం ఎంత ఆరాటమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook