Vastu Tips: వ్యాపారంలో తరచూ నష్టాలొస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే లాభాలు ఖాయం

Vastu Tips: జ్యోతిష్యశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తులోపముంటే అన్నీ నష్టాలే ఎదురౌతుంటాయి. జరిగే పనులు ఆగిపోవడం, వ్యాపారంలో నష్టాలు ఇలా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2023, 03:32 PM IST
Vastu Tips: వ్యాపారంలో తరచూ నష్టాలొస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే లాభాలు ఖాయం

ఎంత కష్టపడినా సఫలం కాలేకపోతుంటే లేదా వ్యాపారంలో నష్టాలు ఎదురౌతుంటే వాస్తుశాస్త్రంలో కొన్ని చిట్కాలు లేదా ఉపాయాలున్నాయి. ఇవి పాటిస్తే మీ సమస్యలు దూరమౌతాయి. మంచి ఫలితాలు సాధిస్తారు. 

జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ సఫలత మాత్రం అందరికీ దక్కదు. ఎవరైనా విజయం సాధిస్తారో వారి కధ మరొకరికి ప్రేరణనిస్తుంది. సమాజంలో చాలామంది తమ జీవితానికి ఐకాన్‌గా మార్చుకుంటారు. ఎందుకంటే విజయగాధ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో  కొంతమందికి కొద్దిపాటి కష్టానికే ఫలితాలు దక్కుతుంటాయి. అక్కడి నుంచి పైకి ఎదుగుతూనే ఉంటారు. కానీ కొంతమందికి ఎంత ప్రయత్నించినా సాఫల్యం కలగదు. నిరాశ ఎదురౌతుంటుంది. ఒక్కోసారి డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఈ పరిస్థితి పనిపై, వ్యాపారంపై పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఉపాయాలున్నాయో తెలుసుకుందాం.

వాస్తుశాస్త్రం ప్రకారం ఒకవేళ మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే సాయంత్రం వేళ రావిచెట్టులో నీరు పోయాలి. దాంతోపాటు మీ మనస్సులో కోర్కె కోరుకోవాలి. ఇంటి బయట శుద్ధమైన కేసరితో స్వస్తిక్ చేసి దానిపై పసుపు పూలుచల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు కుడి కాలు బయటపెట్టాలి.

వ్యాపారంలో నష్టాలతో ఇబ్బందులు పడుతుంటే..రోజురోజుకూ పరిస్థితి దిగజారుతుంటే..ఈ పరిస్థితిని నివారించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో నష్టాల్ని తగ్గించేందుకు ఓ చిటికెడు పిండి తీసుకుని ఆదివారం నాడు వ్యాపార ప్రదేశం లేదా దుకాణం ప్రధాన గుమ్మం వద్ద రెండువైపులా కొద్ది కొద్దిగా చల్లాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయంటారు వాస్తు నిపుణులు.

Also read: RajYog: త్వరలో అరుదైన రాజయోగం.. ఈ రాశులకు ఊహించనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News