Vastu Tips: బల్లి మీద పడినా, కలలో కనిపించినా ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?

Vastu Shastra: బల్లుల భంగిమలు భవిష్యత్తును సూచిస్తాయని మీకు తెలుసా? వాస్తు శాస్త్రాన్ని నమ్మితే ఇది నిజం. అటువంటి సంకేతాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2022, 10:16 AM IST
Vastu Tips: బల్లి మీద పడినా, కలలో కనిపించినా ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?

Vastu Shastra: బల్లి మీద పడితే అపశకునంగా భావిస్తాం. అయితే బల్లి భంగమలను (Signs Related To Lizard) బట్టి భవిష్యత్తు తెలుసుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 

ఇంటి పూజ గదిలో బల్లిని చూస్తే... 
శాస్త్రాల ప్రకారం, బల్లిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. శుభ్రత ఎక్కడ ఉంటే తల్లి  లక్ష్మీ అక్కడ ఉంటుంది. బల్లి గోడ మీద పురుగులను తింటూ ఇంటిని శుభ్రం చేస్తుంది. ఇంటి పూజా మందిరంలో బల్లి కనిపిస్తే.. త్వరలో మీ ఇంట్లో శుభకార్యాలు జరుగబోతున్నాయని,  లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం. 

కొత్త ఇంట్లో బల్లి చనిపోయినట్లు కనిపిస్తే.. 
కొత్త ఇల్లు లేదా దుకాణంలో చనిపోయిన బల్లిని మీరు చూస్తే, అప్పుడు అప్రమత్తంగా ఉండండి. అంటే త్వరలో మీ ఇంటి పెద్ద అనారోగ్యానికి గురవుతారని అర్థం. అదేవిధంగా మట్టిలో బల్లి కనిపించడం కూడా మంచిది కాదు.

బల్లుల కొట్లాట.. 
ఇంట్లో లేదా ఆఫీసులో బల్లులు ఒకదానితో ఒకటి పోరాడడాన్ని మీరు చూస్తే, అది అశుభ సంకేతంగా పరిగణించవచ్చు. త్వరలో మీరు భాగస్వామితో గొడవ పడబోతున్నారని అర్థం. బల్లులు తమలో తాము పోట్లాడుకోవడం కూడా ఇంట్లో సమస్యలు వస్తున్నాయడానికి సంకేతం.  

కాళ్ళ మీద బల్లి పడితే...
ఒక్కోసారి గోడలపై నుంచి పట్టుతప్పి మనమీద బల్లులు పడుతుంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, బల్లి మీ కుడిపాదం మీద పడితే..మీరు త్వరలో టూర్ కు వెళ్లబోతున్నారని దాని వల్ల మీరు ప్రయోజనం పొందబోతున్నారని అర్థం. ఎడమ పాదం మీద బల్లి పడితే మీకు త్వరలో ఆపదలు రాబోతున్నాయని సంకేతం.

బల్లులు ఇలా కనిపించడం మంచిది కాదు..
కలలో మిమ్మల్ని బల్లి భయపెట్టడం, తన్నడం లాంటివి చూస్తే... అది చెడు శకునంగా భావిస్తారు. దీని అర్థం మీరు భవిష్యత్తులో అనారోగ్యం లేదా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కలలో బల్లి మీపై దాడి చేయడం లేదా కీటకాలను తినడం కూడా మంచిది కాదు. మీరు ప్యూచర్ లో ఇబ్బందులు పడబోతున్నారనే దానికి సంకేతం. 

Also Read: Parivartini Ekadashi 2022: పరివర్తిని ఏకాదశి ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News