Utpanna Ekadashi 2022: ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు? దీని యెుక్క విశిష్టత తెలుసుకోండి...

Utpanna Ekadashi 2022: మార్గశీర్ష మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు, దాని ముహూర్తం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 04:42 PM IST
Utpanna Ekadashi 2022: ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు? దీని యెుక్క విశిష్టత తెలుసుకోండి...

Utpanna Ekadashi 2022 Puja: నవంబర్ 8న కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ప్రారంభం కానుంది. మార్గశీర్ష మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశి నాడు శ్రీ కృష్ణుడిని (Lord Vishnu) పూజిస్తారు. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు, దాని ముహూర్తం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి. 

ఉత్పన ఏకాదశి 2022 తేదీ
ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి వ్రతం 20 నవంబర్ 2022 ఆదివారం నాడు జరుపుకోనున్నారు. ఈ ఏకాదశి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈరోజున శ్రీహరిని పూజించి మంత్రాలు జపించిన వారికి మోక్షం లభించింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం యముడి  యెుక్క హింసలను అనుభవించాల్సిన అవసరం లేదని చెబుతారు. 

ఉత్పన ఏకాదశి 2022 ముహూర్తం 
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఏకాదశి తిథి 19 నవంబర్ 2022 ఉదయం 10.29 గంటలకు ప్రారంభమై... 20 నవంబర్ 2022 ఉదయం 10.41 గంటలకు ముగుస్తుంది. ద్వాదశి తిథి నాడు సూర్యోదయం తర్వాత మరుసటి రోజు ఏకాదశి ఉపవాసం విరమిస్తారు. ఉత్పన్న ఏకాదశి వ్రత పారణ సమయం - ఉదయం 06:48 -  ఉదయం 08:56 

ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత
పద్మ పురాణం ప్రకారం, విష్ణువు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. అంతేకాకుండా అసుర ముర్ని చంపాడు, అందుకే దీనికి ఉత్పన్న ఏకాదశి అని పేరు వచ్చింది. ఉత్పన్న ఏకాదశి వ్రతం ప్రభావం వల్ల సంతాన సుఖం, ఆరోగ్యం, జనన మరణ బంధాల నుంచి విముక్తి లభిస్తుంది.

Also Read: Vivah Panchami 2022: వివాహ పంచమి ఎప్పుడు, శుభముహూర్తం, ప్రాముఖ్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News