Ugadi Rasi Phalalu - Vrushabha Rasi 2024 To 25 In Telugu: హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరంలోని ఏప్రిల్ నెల ఎంతో శుభప్రదమైంది ఎందుకంటే ఈ నెలలోనే హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉగాది పండగ కూడా వచ్చింది అంతే కాకుండా ఈ మాసం నుంచే తెలుగు వారి కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. అయితే ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభ సమయంలో ఏదో ఒక గ్రహం సంచారం చేయడమే కాకుండా తీరోగమనం చేస్తూ ఉంటాయి. దీని కారణంగా కొత్త ఏడాదికి జ్యోతిష్యానికి సంబంధాలు ఏర్పడతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరికి వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు పరిష్కారం అవ్వడమే కాకుండా, చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు కూడా పడతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆరోగ్యం కెరీర్ ఆర్థికపరంగా జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇప్పుడు తెలుసుకోండి.
గ్రహాల ప్రత్యేక ప్రభావం...
గ్రహాల ప్రత్యేక ప్రభావం కారణంగా వృషభ రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఉగాది తర్వాత జరిగే గురుడి సంచారం ఈ రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి శని గ్రహం కూడా శుభ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారంలో వస్తున్న సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తొలగిపోయి. జీవిత భాగస్వామి నుంచి ఊహించని లాభాలు పొందుతారు.
ఈ రాశి వారి ఆదాయం రెండు, వ్యాయామం ఎనిమిది
వృషభ రాశి వారికి ఉగాది తర్వాత విపరీతంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల ఆర్థిక నష్టాలను చవిచూసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో వీరికి ఆర్థికపరమైన భారం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో అనేక రకాల సమస్యలు పెరగవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో వస్తున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
కుటుంబ పరంగా చూస్తే...
శ్రీ క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అవమానం మూడు, రాజ్య పూజ్యం ఏడుగా ఉండబోతోంది. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక రకాల పరస్పర మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించి, అనుబంధం మరింత రెట్టింపు అవుతుంది. అలాగే శని ప్రత్యేకమైన ప్రభావం ఈ రాశి వారిపై పడి భాగస్వామి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడపగలుగుతారు.
ఇక విద్యాపరంగా చూస్తే..
ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారి విద్య పరంగా చూస్తే.. ఆది తర్వాత విద్యార్థుల్లో అనేక మార్పులు వస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బాగా చదువుకోవాలి అనుకునేవారు అన్ని సబ్జెక్టులపై ఫోకస్ పెట్టడం చాలా మంచిది. అంతే కాకుండా స్నేహితుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.. లేకపోతే అనేక సమస్యల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. దీని కారణంగా విదేశాల్లో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో కూడా సులభంగా విజయాలు సాధించగలుగుతారు.
కెరీర్ పరంగా చూస్తే..
కెరీర్ పరంగా చూస్తే వృషభ రాశి వారికి ఉగాది తర్వాత లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో సెటిల్ కావాలనుకునే వారి ప్రయత్నాలు పలుస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనులు చేసే వారికి ఈ సమయం కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. కాబట్టి ఎలాంటి పనులు చేసిన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఉద్యోగ బదిలీల్లో అనేక సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో కాంట్రాక్టు బేస్డ్ జాబ్ లభించే అవకాశాలు ఉన్నాయి.
ఆరోగ్యపరంగా..
ఈ కొత్త సంవత్సరంలో ఆరోగ్యపరంగా చూస్తే వృషభ రాశి వారికి కొన్ని కఠినమైన పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ముఖ్యంగా గురుడి ప్రత్యేకమైన ప్రభావంతో ఊదర సమస్యలతో పాటు అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దినచర్యలో మార్పుల కారణంగా చిన్నచిన్న అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారు. కాబట్టి ఈ సమయంలో యోగాతో పాటు ధ్యానం చేయడం కూడా చాలా మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి