Ugadi Rasi Phalalu - Mesha Rasi 2024 To 25: మేషరాశి వారి ఉగాది పంచాంగం.. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారా?

Ugadi Rasi Phalalu - Mesha Rasi 2024 To 25: ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధనామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది అయితే ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 4, 2024, 10:53 PM IST
Ugadi Rasi Phalalu - Mesha Rasi 2024 To 25: మేషరాశి వారి ఉగాది పంచాంగం.. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారా?

 

Ugadi Rasi Phalalu - Mesha Rasi 2024 To 25: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన ఏప్రిల్ నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ నెలలోనే హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉగాది పండుగ కూడా వచ్చింది ఈ సంవత్సరం ఉగాది పండగ ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం వచ్చింది. అయితే ఈ రోజు నుంచే హిందువుల కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సరం మొదలవుతుంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే మొదటి రాశిగా భావించే మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉండబోతున్నాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహాన్ని శాస్త్రం ప్రకారం ధైర్యం ఉత్సాహానికి సూచికగా పరిగణిస్తారు కాబట్టి మేష రాశి వారు ఈ సంవత్సరం ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు.  అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ఊహించని లాభాలతో కాలం కొనసాగుతుంది. కానీ ఈ సమయంలో కొన్ని అడ్డంకులతో పాటు సవాళ్లు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్లడం వల్ల అంతిమంగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ కొత్త ఏడాది మేష రాశి వారికి ఆదాయం పరంగా జీవనం, ఆరోగ్యము ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.

ఈ క్రోధనామ సంవత్సరంలో మేష రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సమయంలో పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతులు లభించే ఛాన్స్ ఉంది. అలాగే ఏప్రిల్ నెలలో జరిగే కుజ, శుక్ర గ్రహాలతో పాటు మరెన్నో గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలగవచ్చు.

ఈ ఏడాది మేష రాశి వారి వ్యాయామం 14, ఆదాయం 8
పంచాంగం ప్రకారం ఉగాది నుంచి ప్రారంభం కాబోయే కొత్త సంవత్సరంలో మేష రాశి వారికి ఆదాయం తక్కువగా ఉండి, ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆస్తులు కొనుగోలు చేసి పెట్టుబడులు కూడా పెడతారు. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది. దీంతోపాటు జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

కుటుంబ పరంగా..
మేష రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో కుటుంబ పరంగా చూస్తే జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏప్రిల్ నెల నుంచి కుటుంబంలో సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మేష రాశి వారికి సోదరుల సపోర్టు లభించి ఎంతో ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా గురు గ్రహ ప్రభావం వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి. అలాగే వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల్లో కావలసిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. 

ఇక విద్యాపరంగా చూస్తే..
మేష రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో విద్యార్థులు చిన్నచిన్న సవాలనే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం కారణంగా ప్రణాళికలు వేసి చదవడం వల్ల విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో సానుకూల శక్తిని పెంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ మే నెలలో ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ ఆసక్తి కలిగి పూజలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కష్టపడడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు.

మేషరాశి వారి కెరీర్..
మేష రాశి వారికి భవిష్యత్తు పరంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి ముఖ్యంగా మంచి పురోగతితో జీవనాన్ని సాధిస్తారు ఉద్యోగాలు చేసే వారికి సీనియర్ అధికారుల నుంచి సపోర్టు లభించి పదోన్నతులు లభించే ఛాన్స్ కూడా ఉంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి రాజకీయ నాయకుల సపోర్టు లభించి, ధైర్యంగా వ్యాపారాలు చేయగలుగుతారు. రాహు ప్రభావంతో అన్ని రకాల కోరికలను సులభంగా నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మేష రాశి వారి ఆరోగ్యం..
ఇక మేష రాశి వారి ఆరోగ్య విషయానికొస్తే ఈ క్రోధనామ సంవత్సరంలో గురుడి ప్రత్యేక ప్రభావంతో ఇంతకుముందు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శక్తివంతంగా తయారవుతారు. మనసులో కలిగే ప్రతికూల ఆలోచనలు కూడా తొలగిపోతాయి. దీంతోపాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలున్నాయి. అలాగే వీరు ఈ సంవత్సరంలోని చివర ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఈ క్రోధనామ సంవత్సరంలో మేష రాశి వారు తప్పకుండా పాటించాల్సిన పరిహారాలు:
మేష రాశి వారు ఈ కొత్త సంవత్సరంలో ఆదాయం పెంచుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి శుక్రవారం సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం శ్రేయస్కరం.
అంతేకాకుండా ఈ సంవత్సరంలో వీరు సూర్యభగవానుడిని పూజించడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.
అలాగే ఈ సంవత్సరంలో తప్పకుండా గోవులకు వేరుశనగతో కూడిన మేతను తినిపించాల్సి ఉంటుంది. 
అలాగే ప్రతి మంగళవారం పూట హనుమాన్ చాలీసా పాటించాలి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News