Ugadi Festival 2024: ఉగాది పండుగ వెనుక ఉండే సైంటిఫిక్ రీజన్ ఇదే..!

Scientific Reason Behind Ugadi: ఉగాది పచ్చడిని ఒక సాంప్రదాయ ఆచారంగా మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారంగా కూడా పరిగణించవచ్చు. ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలోని ఆరు భావోద్వేగాలను సూచిస్తాయి. అంతేకాకుండా, ఈ పచ్చడిలో ఉండే పదార్థాలు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2024, 02:01 PM IST
Ugadi Festival 2024: ఉగాది పండుగ వెనుక ఉండే సైంటిఫిక్ రీజన్ ఇదే..!

Scientific Reason Behind Ugadi: ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ ఋతువులో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడి వల్ల చాలా మంది జ్వరాలు, ఆటలమ్మ వంటి వ్యాధుల బారిన పడతారు.ఈ వ్యాధుల వల్ల చాలా మంది మరణిస్తుంటారు. దీని కారణంగా మన ఋషులు ఈ కాలాన్ని "యమద్రంస్టలు" అని పిలిచేవారు. యమద్రంస్టలు అంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మందిని నాశనం చేస్తాడని అర్థం.కాబట్టి ఈ కాలంలో జనం ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే. అందుకే మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఉగాది పచ్చడి లాంటి ఆహారాలను తయారు చేసుకొని తింటాము.

ఉగాది పచ్చడి  వైజ్ఞానిక అంశం:

ఉగాది పచ్చడి ఒక రుచికరమైన వంటకం మాత్రమే కాదు, దాని వెనుక చాలా వైజ్ఞానిక కారణాలు కూడా ఉన్నాయి. దీని తీసుకోవడం వల్ల ఈ కాలం వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

ఉగాదిలో పచ్చడి ఆరోగ్య లాభాలు: 

వేప పూత: 

వేప పూతలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

మామిడి పచ్చ: 

మామిడి పచ్చలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

చింతపండు: 

చింతపండులో ఉండే యాసిటిక్ ఆమ్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఖర్జూరం: 

ఖర్జూరంలో ఐరన్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

బెల్లం: 

బెల్లం శరీరానికి వేడిని ఇస్తుంది.

మిరియాలు, ఉప్పు: 

మిరియాలు, ఉప్పు రుచిని మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి.

ఈ ఉగాది పచ్చడిని ఒక్క ఉగాది రోజు మాత్రమే కాకుండా ఉగాది మొదలుకొని శ్రీ రామనవమి లేదా చైత్ర పౌర్ణిమ వరకు ప్రతిరోజూ తీసుకోవడంఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా తొమ్మిది లేదా పదిహేను రోజుల పాటు ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు.

ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి, ఆటలమ్మ, అమ్మోరు వంటి వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉండి, కఫము, వాతము, పైత్యము అనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది. మనకు వచ్చే చాలా రోగాలు ఈ మూడు దోషాల వల్లనే వస్తాయి. కాబట్టి, ఉగాది పచ్చడిని ఒక ఆచారంగా మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారంగా కూడా భావించి ఈ సంవత్సరం ఉగాది నుంచి శ్రీ రామనవమి లేదా చైత్ర పౌర్ణిమ వరకు ప్రతిరోజూ తీసుకోవడం మంచిదని నిపుణులు, పండితులు చెబుతున్నారు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News