Ugadi Dhanassu Rasi Phalalu 2024-25: శ్రీక్రోధినామ సంవత్సరం.. ధనస్సు రాశివారికి ఎలా ఉంటుందంటే..?

Ugadi Dhanassu Rasi Phalalu 2024-25: ఉగాది ధనస్సు రాశివారికి శుభ  ఫలితాలు పొందుతారు. ఈ రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందుతారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 7, 2024, 11:37 AM IST
Ugadi Dhanassu Rasi Phalalu 2024-25: శ్రీక్రోధినామ సంవత్సరం.. ధనస్సు రాశివారికి ఎలా ఉంటుందంటే..?

Ugadi Dhanassu Rasi Phalalu 2024-25: ఉగాది ధనస్సు రాశివారికి శుభ  ఫలితాలు పొందుతారు. ఈ రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందుతారు. ఈ ఏడాది కొంతమంది శత్రువులు మీ గౌరవ మర్యాదాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు.ధనస్సు రాశివారికి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ రాశివారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.

విద్యారంగంలో ఉన్నవారు పట్టుదలతో చదివి మంచి ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యను సాధించడంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అనుకున్న సమయంలో సాధిస్తారు. ప్రమోషన్‌తో కూడిన బదిలీ జరిగే అవకాశం ఉద్యోగుల్లో ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు బాగా శ్రమపడితే లాభాలు గడిస్తారు.వ్యవసాయరంగంలో పంటలు బాగా పండుతాయి. ఒక్కోసారి చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించకపోవచ్చు. అయినా కానీ సాధారణ ఫలితాలు పొందుతారు. క్రీడాకారులు, కళాకారులకు సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి.

ధనస్సు రాశివారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కష్టానికి తగిన ఫలితం వస్తుంది. కొద్దిపాటి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టు రంగంలో ఉన్నవారికి బిల్లులు సకాలంలో రాక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పెద్ద కాంట్రాక్టులు చేసే వారు జాగ్రత్తవహించాలి. 

ఇదీ చదవండి: తులరాశివారు ఈ ఒక్కనియమం పాటిస్తే ఈ ఏడాది నక్కతోకతొక్కినట్టే.. ఇల్లు, ఆర్థికయోగం..!

రాజకీయ రంగంపరంగా ధనస్సు రాశివారు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. గుర్తింపు మాత్రం సాధారణంగ ఉంటుంది. ఇక ధనస్సు రాశికి చెందిన స్త్రీలు వివాహం ఆలస్యం అయినవారు మంచి మార్గం దొరుకుతుంది. కుటుంబంలో విభేదాలు వస్తే మీ తెలివితేటలతో సానుకూల వాతావరణం కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే బంధువర్గం, స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి.

ఇదీ చదవండి:  క్రోధినామ సంవత్సరం.. వృశ్చిక రాశివారికి ఇంత అదృష్టం మళ్లీరాదు..  

మూల నక్షత్రం 1,2,3, 4 జూన్‌ జూలై నవంబర్ బాగా కలిసి వచ్చు నెలలు. పూర్వాషాడ నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై బాగా కలిసి వస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News